శ్రీ‌వ‌ల్లికి డబ్బులు పెట్టలేదు- అప్పుడు మ్యాడ్ సినిమాను తిట్టారు, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు

బుధవారం, 4 ఆగస్టు 2021 (14:51 IST)
MAD crew
సినిమా బాగుందంటే ఆ చిత్ర విజయాన్ని ఎవరూ ఆపలేరు. ఆ విషయాన్ని నమ్మే మేము మీ ముందుకు వస్తున్నాం. సోషల్ మీడియాలో మా మూవీని తిట్టడంతో స్టార్ట్ చేసి, ఇప్పుడు ప్రశంసిస్తున్నారు. మా సినిమా పాటలు, టీజర్, ట్రైలర్ లాంటి కంటెంట్ వాళ్లకు బాగా నచ్చింది. "మ్యాడ్" సినిమా చూస్తేనే మీకు దర్శకుడు చిత్రంలో ఏం చెప్పబోతున్నాడో అర్థమవుతుంది. కానీ సినిమా చూడకుండానే కామెంట్స్ పెట్టకండి. సినిమా చూశాక మీకు అనిపించింది చెప్పండని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను శ్రీవల్లి అనే సినిమా చేశాను. శ్రీవల్లి సినిమాకు నేను డబ్బులు పెట్టానని అంతా అపార్థం చేసుకున్నారు. కానీ నేను డబ్బులు పెట్టలేదు. వాళ్లు అడగలేదు. ఆ తర్వాత నాకు సినిమాలు లేవు. "మ్యాడ్" మూవీ మీద నేను చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఆడియెన్స్ సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నాం` అని హీరో రజత్ రాఘవ్ అన్నారు.
 
మాధవ్ చిలుకూరి, స్పందన పల్లి, రజత్ రాఘవ్, శ్వేతవర్మ  ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా "మ్యాడ్". మోదెల టాకీస్  బ్యాన‌ర్ పై టి. వేణు గోపాల్ రెడ్డి, బి. కృష్ణారెడ్డి.  మిత్రులు నిర్మాత‌లుగా  లక్ష్మణ్ మేనేని ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ చిత్రం ఈనెల 6న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా "మ్యాడ్" సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని తమ సంతోషాన్ని పంచుకున్నారు.
 
లిరిసిస్ట్ లక్ష్మీ ప్రియాంక మాట్లాడుతూ, మోహిత్ రెహ్మానియానిక్ ఇచ్చిన ట్యూన్స్ అద్భుతంగా ఉన్నాయి. నాకు ఒక్కో పాట ఇస్తూ మొత్తంగా ఐదు పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ లవ్ లీ పీపుల్. చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇతర టెక్నికల్ టీమ్ అంతా సూపర్బ్ గా పనిచేశారు. మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ వచ్చారు. మ్యాడ్ చూస్తూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
 
నటి ఇందు మాట్లాడుతూ, మా ఇంట్లో, నా ఫ్రెండ్స్ నన్ను ఆర్ యూ మ్యాడ్ అంటారు. ఈ పోస్టర్ నాకు పంపి డైరెక్టర్ గారు పిలిచినప్పుడు చాలా క్రేజీగా ఉంది సార్ అని వెళ్లి కథ విన్నాను. చాలా మంచి స్టోరీ. మా డైరెక్టర్ గారు ఎప్పుడూ స్ట్రెస్ ఫీల్ అవరు. "మ్యాడ్" మూవీ కోసం పనిచేయడం ప్లెజంట్ గా అనిపించింది. హీరో హీరోయిన్స్ తో పనిచేయడం చాలా కంఫర్ట్ గా అనిపించింది. మా సినిమా కాస్ట్ అండ్ క్రూ అందరికీ ఆల్ ద బెస్ట్. సినిమా చూసి మమ్మల్ని విష్ చేయండి. అన్నారు. 
 
దర్శకుడు లక్ష్మణ్ మేనేని మాట్లాడుతూ... మా ఫ్రెండ్స్ సపోర్ట్ తో "మ్యాడ్" సినిమా చేశాను. ఈ సినిమా చేసి వెళ్లిపోదాం అనుకున్నాను. కానీ మా కాస్ట్ అండ్ క్రూతో ఒక అనుబంధం ఏర్పడింది. ఇక్కడికొచ్చాక తెలిసింది ఇంత ప్రాణం పెట్టి సినిమా చేస్తారా అని. "మ్యాడ్" మూవీ ఒక ఫీస్ట్ లా ఉంటుంది. రెగ్యులర్ చిత్రంలా ఉండదు. సినిమా చూసి బాగుంటే చాలా బాగుందని చెప్పండి. థాంక్స్ టు ఆల్. అన్నారు.
 
హీరో మాధవ్ చిలుకూరి మాట్లాడుతూ.. మా సినిమాకు పెద్ద గెస్ట్ మీడియానే. చిన్న సినిమాను బయటకు తీసుకెళ్లేది మీరే. మా చిన్న సినిమాకు ఇదే పెద్ద ఈవెంట్. మీ సపోర్ట్ కావాలి. మేమంతా చాలా హోప్స్ పెట్టుకుని ఈ సినిమా చేశాం. కరోనా వల్ల థియేటర్స్ క్లోజ్ అయినప్పుడు మేమంతా డిప్రెషన్ లోకి వెళ్లాం. ఇవాళ మా "మ్యాడ్" మూవీ థియేటర్ లో రిలీజ్ అవుతుండటం చాలా సంతోషంగా ఉంది. థియేటర్ లో మా చిత్రాన్ని చూడండి. అన్నారు.
 
నిర్మాత కృష్ణారెడ్డి మాట్లాడుతూ...మా సినిమాకు వేణుగోపాల్ రెడ్డి గారు రియల్ ఫిల్లర్   అన్నారు. మా పదేళ్ల కల "మ్యాడ్" సినిమా. మా కాస్ట్ అండ్ క్రూ గురించి చెబితే మమ్మల్ని మేము పొగుడుకున్నట్లు అవుతుంది. ఈ సినిమా సక్సెస్ అయితే చాలా మందికి హోప్ ఇవ్వగలం అనుకుంటున్నాం. అన్నారు.
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు