ఎన్టీఆర్ బ‌యోపిక్ ప్రి-రిలీజ్ ఈవెంట్‌కు తారక్‌ని పిలుస్తారా..? పిల‌వ‌రా..?

శనివారం, 15 డిశెంబరు 2018 (11:16 IST)
నంద‌మూరి తార‌క రామారావు జీవిత క‌థ‌తో రూపొందుతోన్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం ఎన్టీఆర్. జాగ‌ర్ల‌మూడి క్రిష్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అయితే.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఎన్టీఆర్ పుట్టిన ఊరైన నిమ్మ‌కూరులో చేయ‌డానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఈవెంట్‌కు ఎన్టీఆర్ ఫ్యామిలీ సభ్యులందరినీ ఆహ్వానిస్తున్నారు. అయితే.. తారక్‌కి ఇంకా పిలుపు రాలేదట... అసలు పిలుస్తారా..? తార‌క్ త‌ల్లిని పిలుస్తారా..? ల‌క్ష్మీ పార్వ‌తిని పిలుస్తారా..? అనేది అంద‌రిలో ఉన్న డౌట్.
 
హ‌రికృష్ణ చ‌నిపోయిన త‌ర్వాత తార‌క్ - బాల‌య్య బాగానే ద‌గ్గ‌ర‌య్యారు. అర‌వింద స‌మేత స‌క్స‌స్ మీట్‌కు బాల‌య్య రావ‌డం తెలిసిందే. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు తార‌క్‌ని పిల‌వ‌లేదు. ఈ ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ ఈ నెల 21న జ‌ర‌ుప‌నున్నారు. క‌ళ్యాణ్ రామ్ ఈ సినిమాలో హ‌రికృష్ణ పాత్ర పోషించారు కాబ‌ట్టి ఖ‌చ్చితంగా పిలుస్తారు. 
 
మ‌రి.. ప‌నిలో ప‌నిగా తార‌క్‌ని పిలుస్తారా..? పిల‌వ‌రా..? అనేది ఆస‌క్తిగా మారింది. కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నంద‌మూరి సుహాసిని పోటీ చేసిన విష‌యం తెలిసిందే. తార‌క్ సోద‌రి సుహాసిని త‌రుపున ప్ర‌చారం చేసేందుకు రాలేదు. ఈ నేప‌ధ్యంలో పిలుస్తారో..? పిల‌వ‌రో చూడాలి మ‌రి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు