హైదరాబాద్‌ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్.. బంగారాన్ని పేస్టులా?

సోమవారం, 23 జులై 2018 (13:07 IST)
హైదరాబాద్‌లో కొత్త సంస్కృతి వెలుగులోకి వచ్చింది. పాతబస్తీలోని చంద్రాయణగుట్టలో ఓ పెళ్లి వేడుకలో బెల్లీ డ్యాన్స్‌ నిర్వహించారు. ఫంక్షన్‌హాల్లో జరిగిన పెళ్లి వేడుకలో విదేశీ అమ్మాయిలతో అశ్లీల నృత్యాలు చేయించారు. విషయం తెలుసుకున్న సౌత్‌జోన్‌ పోలీసులు బెల్లీ డ్యాన్స్‌ నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
 
ఇదిలా ఉంటే.. బంగారాన్ని తరలించేందుకు కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నారు స్మగ్లర్లు. గతంలో గోళ్లు, శరీర భాగంలో బంగారం దాచుకుని అక్రమ రవాణా చేశారు. ఇప్పుడు పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్‌కు పాల్పడుతున్నారు. ఈ నయా మోసం శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో బయటపడింది. 
 
స్కానింగ్ మిషిన్లు కనిపెట్టకుండా వుండేందుకు పేస్ట్ రూపంలో గోల్డ్ స్మగ్లింగ్ చేస్తున్నారు. పేస్ట్ కాల్చి గుట్టు రట్టు చేసిన శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు... శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ప్రయాణీకులతో సందడిగా ఉంది. ప్యాసింజర్లను డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. 
 
కొలంబో నుంచి వచ్చిన ప్రయాణీకుడి వద్ద కిలో పన్నెండు గ్రాముల పేస్ట్ లభించింది. పేస్ట్ కాస్తా పరిశోధనలో బంగారంగా మారింది. ఈ క్రమంలో కొలంబో నుంచి వచ్చిన గోల్డ్ స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు