ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటించే సినిమా మరో మూడు నెలల్లో పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే20న తారక్ పుట్టిన రోజే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంటుందని సంకేతాలు అందుతున్నాయి. ప్రి ప్రొడక్షన్ వర్క్ పనులు సాగిస్తూనే, కాస్ట్ అండ్ క్రూ ఎంపికపై దృష్టిసారించాడట దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు కథానాయిక, సంగీత దర్శకుడు ఖరారయ్యారు. అలాగే సినిమా విడుదల విషయంలోనూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.