NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన

దేవీ

మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (17:25 IST)
NTR- neal prakatana
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌. ప్ర‌స్తుతం కెజియ‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన సెన్సేష‌న‌ల్ ఫిల్మ్ మేక‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.  ‘ఎన్టీఆర్‌నీల్‌’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో కొన్నిరోజుల ముందు సినిమాను ప్రారంభించారు. అనౌన్స్‌మెంట్ నుంచి సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలా మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్‌తో అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
రోజు రోజుకీ క్రేజీ కాంబోలో తెర‌కెక్కుతోన్న‌ ‘ఎన్టీఆర్‌నీల్‌’ మూవీపై అంచ‌నాలు పెరుగుతూ వ‌స్తున్నాయి. అభిమానులు, ప్రేక్ష‌కులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎంతో ఆతృత‌గా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్  ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ పాన్ ఇండియా యాక్ష‌న్ చిత్రాన్ని వ‌ర‌ల్డ్ వైడ్‌గా జూన్ 25, 2026లో విడుద‌ల చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ, క‌న్న‌డ, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా సినిమా అంద‌రినీ అల‌రించ‌నుంది.
 
 ఎన్టీఆర్‌నీల్ చిత్రంలో తార‌క్‌ను  ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో ప్ర‌శాంత్‌నీల్ ఎలా ప్రెజంట్ చేస్తాడో చూడాల‌ని అంద‌రూ ఎంతో ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నారు. గూజ్‌బంప్స్ తెప్పించే యాక్ష‌న్ స‌న్నివేశాలు, గ్రిప్పింగ్ స్టోరీతో రానున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్‌, ఆడియెన్స్ ఎంతో ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఈ ఎగ్జ‌యిట్‌మెంట్‌ను పెంచేలా మేక‌ర్స్ ఓ స‌రైన విడుద‌ల తేదిని ఎంచుకోవ‌టం విశేషం.
 
బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించ‌టంలో ప్ర‌శాంత్ నీల్‌కు ఓ ప్ర‌త్యేక‌మైన శైలి ఉంది. త‌న‌దైన స్టైల్లో ఎన్టీఆర్‌ను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ వెండితెర‌పై చూపించ‌ని విధంగా స‌రికొత్త మాస్ అవ‌తార్‌లో నీల్ ఆవిష్క‌రించ‌నున్నారు. సినీ ఇండ‌స్ట్రీలోనే ఎన్టీఆర్‌, నీల్ కాంబోలో వ‌స్తోన్న ఈ చిత్రం స‌రికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఓ స‌రికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించేలా అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మిస్తున్నారు.
 
ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్,  ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై కళ్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరి కృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి భువన్ గౌడ సినిమాటోగ్రఫర్‌గా, రవి బస్రూర్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఈ మూవీకి ప్రొడక్షన్ డిజైనర్‌గా చలపతి స‌హా ఈ ప్రెస్టీజియ‌స్ మూవీలో టాప్ మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్స్‌, టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు