ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఎన్టీఆర్ నీల్’ వ‌ర్కింగ్ టైటిల్‌తో చిత్రం ప్రకటన

డీవీ

సోమవారం, 20 మే 2024 (11:49 IST)
NTR Neil working title
ప్ర‌పంచ వ్యాప్తంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌కు ఉండే క్రేజ్, ఫ్యాన్ బేస్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంచ‌నాల‌కు అనుగుణంగానే తార‌క్ భారీ, క్రేజీ సినిమాల‌ను లైన‌ప్ చేస్తున్నారు. అందులో భాగంగా కె.జి.య‌ఫ్‌, స‌లార్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన‌ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. ‘ఎన్టీఆర్ నీల్’ అనే వ‌ర్కింగ్ టైటిల్‌తో ఈ మూవీ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్ర‌క‌ట‌న ఎప్పుడో వ‌చ్చేసింది. దీనిపై ఫ్యాన్స్ స‌హా అంద‌రిలోనూ భారీ అంచ‌నాలున్నాయి.
 
ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా  మేక‌ర్స్ ఎన్టీఆర్ నీల్ మూవీ షూటింగ్‌ను ఆగ‌స్ట్ 2024 నుంచి ప్రారంభించనున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తార‌క్ బ‌ర్త్ డే రోజున ఫ్యాన్స్‌కి స‌ర్‌ప్రైజ్‌నిస్తూ మేక‌ర్స్ ఇచ్చిన ఈ అప్‌డేట్ అంద‌రికీ థ్రిల్లింగ్‌గా అనిపించింది. ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను ఫైన‌ల్ చేస్తున్నారు. అభిమానులు, సినీ ప్రేమికులు అంచ‌నాల‌ను మించేలా సినిమాను రూపొందించ‌నున్నారు.
 
ఎన్టీఆర్‌కున్న మాస్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆన్ స్క్రీన్‌పై ప్రెజంట్ చేస్తూ యూనిక్ మాస్ క్రేజ్ క్రియేట్ చేసి దాన్ని మ‌రో రేంజ్‌కు తీసుకెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్‌. వీరిద్ద‌రి కాంబినేష‌న్‌లో రాబోతున్న ఎన్టీఆర్ నీల్ ప్రాజెక్ట్ సినీ ఇండ‌స్ట్రీలో స‌రికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుంద‌ని అభిమానులు, ప్రేక్ష‌కులు భావిస్తున్నారు. దీంతో సినిమాపై అంచ‌నాలు ఆకాశాన్నంటుతున్నాయి.
 
ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ఎన్టీఆర్ ఆర్ట్స్ ప‌తాకాల‌పై ఈ సినిమా రూపొంద‌నుంది. కె.జి.య‌ఫ్ సినిమాకు ధీటుగా భారీ స్కేల్‌తో అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చేలా సినిమాను తెర‌కెక్కించ‌టానికి ప్లానింగ్ జ‌రుగుతోంది. ఎన్టీఆర్ స్టార్ ప‌వ‌ర్‌, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్ విజ‌న‌రీతో రూపొంద‌నున్న ఎన్టీఆర్‌నీల్ మూవీ ఇండియ‌న్ సినిమాలోనే స‌రికొత్త మైల్ స్టోన్‌ను క్రియేట్ చేస్తుంద‌న‌టంలో సందేహం లేదు. ఆగ‌స్ట్ నెల‌లో షూటింగ్ ప్రారంభం కానుంది. అంటే స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతోంది. దీంతో సినిమా ఎలా ఉండ‌బోతుందో చూడాల‌నే కుతూహ‌లం  అభిమానులతో పాటు అంద‌రిలోనూ పెరిగిపోతుంది.
 
ఎన్టీఆర్ ప్ర‌స్తుతం దేవ‌ర‌, వార్ 2 సినిమాల‌తో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్టుల‌ను పూర్తి చేసుకున్న త‌ర్వాత ఆయ‌న ప్ర‌శాంత్ నీల్ సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు