''పార్టీ'' కోసం పాట పాడిన అన్నదమ్ములు.. ఎవరు? (వీడియో)

శుక్రవారం, 6 జులై 2018 (14:34 IST)
టాప్ హీరోలు, అన్నదమ్ములు సూర్య, కార్తీ గాయకులుగా మారిపోయారు. త‌మిళంలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ''పార్టీ''. ఈ చిత్రం కోసం ఈ సోద‌రులు కలసి ఓ పాటను పాడారు. ప్ర‌భు కోర‌డంతో కాద‌న‌లేక స్వ‌రం అందించార‌ట‌. 
 
ఈ సినిమాలో ఇద్దరు కలిసి నటించకపోయినా.. పాటను ఇరగదీశారు. తమ గొంతుతో ఛ.. ఛ.. ఛారే.. అంటూ సాగిన పాటను పాడారు. ప్రస్తుతం ఈ పాటకు ఒక మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఈ విషయాన్ని సినీ యూనిట్ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. 
 
''పార్టీ'' సినిమా మల్టీస్టారర్‌గా తెరకెక్కుతోంది. జై, శివ, సత్యరాజ్, జయరాం, రమ్యకృష్ణన్, రెజీనా, నాజర్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు ప్రేమ్‌జీ సంగీతం అందించాడు. అమ్మ క్రియేషన్‌పై టి.శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సూర్య, కార్తీ పాడిన పాటకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు