హీరో, జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ మరోమారు తండ్రి అయ్యారు. ఆయన భార్య అన్నా లెజ్నోవా రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇప్పటికే పవన్ కల్యాణ్‌కు ఇద్దరు ఆడపిల్లలు, ఒక బాబు ఉన్న సంగతి తెలిసిందే.
పవన్ కల్యాణ్ తొలి భార్యకు పిల్లలు లేకపోగా, రెండో భార్య, సినీ నటి రేణూ దేశాయ్‌తో బాబు (అకీరా), ఒక పాప (ఆద్య)కు తండ్రి కాగా, తర్వాత మూడో వివాహం చేసుకున్న అన్నా లెజ్నోవాకు గతంలో పాప పుట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ దంపతులకు బాబు పుట్టాడు.