అల్లు అర్జున్-పవన్ కల్యాణ్ వార్.. చిరంజీవి బన్నీకి వార్నింగ్ ఇచ్చారా?

మంగళవారం, 17 మే 2016 (15:25 IST)
అల్లు అర్జున్- పవన్ కల్యాణ్ మాటల వార్‌లో మెగాస్టార్ చిరంజీవి కలుగజేసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. పవన్ కల్యాణ్‌పై ఒక్కసారి కాదు.. ఏకంగా రెండుసార్లు ఆయన గురించి చెప్పను బ్రదరూ అంటూ అల్లు అర్జున్ చేసిన కామెంట్స్‌పై మెగా ఫ్యాన్స్‌లోనూ వార్ జరుగుతోంది.

బన్నీ ఫ్యాన్స్ పవన్‌పైనా.. పవన్ ఫ్యాన్స్‌ బన్నీ ఫ్యాన్స్ పైనా వ్యతిరేక ప్రచారాలు చేస్తున్న తరుణంలో చిరంజీవి రంగంలోకి దిగారని సమాచారం. ఇంకా బన్నీని లంచ్‌కు పిలిచి పవన్‌పై కామెంట్స్‌పై ఆరాతీశారని, ఫ్యాన్స్ మధ్య చీలిక ఏర్పరచకూడదని సూచించినట్లు తెలిపినట్లు సమాచారం.
 
దీనితో రంగంలోకి దిగిన చిరంజీవి.. అభిమానుల మధ్య గొడవకు ముగింపు పలకాలని భావించి.. బన్నీని చిన్న విషయాన్ని పెద్దదిగా చేయవద్దని చెప్పారు. ఒకానొక  సమయంలో చిరంజీవి తన సహనాన్ని కూడా కోల్పోయాడని తెలుస్తోంది.

అంతేకాదు ఈ గొడవ విషయంలో మెగా ఫ్యామిలి నుండి ఎవరో ఒకరు క్లారిటీ ఇవ్వనున్నారని సమాచారం. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోకపోవడంతో పాటు బన్నీ మాటలపై చిరంజీవి మాత్రం సీరియస్‌ అయినట్లు తెలుస్తోంది.

వెబ్దునియా పై చదవండి