నా దేవుడు పవన్ కళ్యాణ్.. నా కలలు నిజమయ్యాయి... : బండ్ల గణేష్

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (14:13 IST)
గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్ - బండ్ల గణేష్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'గబ్బర్ సింగ్'. పవన్ కళ్యాణ్ సినీ కెరీర్‌లోనే కాకుండా తెలుగులో పాత రికార్డులను తిరగరాసిన చిత్రంగా నిలిచిపోయింది. ఇపుడు మరోమారు ఈ కాంబో రిపీట్ కానుంది. పవన్ హీరోగా బండ్ల గణేష్ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ విషయాన్ని బండ్ల గణేష్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. 
 
"నా బాస్‌ ఓకే చెప్పారు. మరోసారి ఆయనతో కలిసి పనిచేయబోతున్నాను. నా నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ఆయనతో చేస్తున్నాను. నా కలలు నిజమయ్యాయి. నా దేవుడు పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు' అంటూ మెసేజ్‌తో పాటు పవన్‌ కల్యాణ్‌తో కలిసి ఆయన దిగిన సెల్ఫీ ఫోటోను షేర్‌ చేశారు. 
 
నిజానికి గతంలో 'గబ్బర్ సింగ్'‌తో పాటు.. 'తీన్మార్' చిత్రాలు వచ్చాయి. ఇందులో 'తీన్మార్' అట్టర్ ఫ్లాప్ అయింది. దీంతో 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని ఉచితంగా పవన్ కళ్యాణ్ చేసిపెట్టాడు. ఈ చిత్రంతో బండ్ల గణేష్ దశ తిరిగిపోయింది 
 
ఇపుడు మరోమారు వీరి కాంబినేషన్‌లో ఎలాంటి సినిమా తెరకెక్కనుంది. ఎవరు డైరెక్ట్‌ చేస్తారు? అనే అంశాలు ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపుతున్నాయి. 2015లో విడుదలైన "టెంపర్‌" సినిమా తర్వాత బండ్లగణేశ్‌ మరో సినిమాను నిర్మించలేదు. దాదాపు ఐదేళ్ల గ్యాప్‌ తర్వాత బండ్లగణేశ్‌ నిర్మించే చిత్రమిదే అవుతుంది.

 

My boss said okay and once again my dreams come true .
Thank you my god ⁦@PawanKalyan

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు