మెంటల్ టార్చర్ భరించడం వల్ల కాదు, ఆ విషయంలో పవన్ చాలా స్ట్రాంగ్: విజయ్ సేతుపతి

డీవీ

సోమవారం, 10 జూన్ 2024 (17:54 IST)
Vijay Sethupathi
ప్రతి హీరోలకు ఏదోవిధంగా విమర్శలు వస్తుంటాయి. ట్రోల్స్ కూడా చాలామంది చేస్తుంటారు. వాటిని నిలదొక్కుకోవాలంటే మానసికంగా బలంగా వుండాలి. అది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సాధ్యపడింది అని తమిళ నటుడు విజయ్ సేతుపతి అన్నారు. తాజాగా ఆయన నటించిన మహారాజ సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ వచ్చారు.
 
ఈ సందర్భంగాపలు విషయాలు చెబుతూ పవన్ కళ్యాన్ గురించి అడగగానే, ఆయన మాట్లాడుతూ, పవన్ కు నా బెస్ట్ విషెశ్ చెబుతున్నాను. ఎన్నికల్లో నిలబడినప్పుడు ఎన్నో ట్రోల్స్ ఆయన మీద వచ్చాయి. ఆయన సినిమాలోనే హీరో కాదు. నిజజీవితంలో హీరో. ఆయన హార్ట్ ఫుల్ పర్సన్. నిజజీవితంలో ఆయనకంటూ ప్రత్యేకమైన స్టోరీరి రాసుకున్నారు. నా టీమ్ లోనూ చాలామంది పవన్ సార్ వీడియోలు చూస్తారు. అవి చూడగానే నాకు ఏదో ఎనర్జీ వచ్చినట్లు ఫీలయ్యేవాడిని అని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు