సినిమా సేన : యూ టర్న్ తీసుకున్న పవన్ కళ్యాణ్?

సోమవారం, 3 జూన్ 2019 (10:55 IST)
ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సైతం ఓటమిని చవిచూశారు. కేవలం ఒకే ఒక్క అభ్యర్థి మాత్రం తన ఛర్మిష్మాతో ఫ్యాను గాలిని తట్టుకుని నిలబడ్డారు.
 
దీంతో పవన్ కళ్యాణ్ మనసు మార్చుకున్నారు. తిరిగి సినిమాల్లో నటించాలని ఆయన భావిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా, ఇకపై కెమెరా ముందుకు వెళ్లనని, తన తుదిశ్వాస వరకు రాజకీయలకే అంకితమని ప్రకటించారు. కానీ, ఈ ఎన్నికల్లో ఎదురైన ఫలితాలతో ఆయన మనసు మార్చుకున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ క్రమంలో తన ఆప్తమిత్రుడైన దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కలిసి ఓ చిత్రంలో నిర్మించనున్నారనే వార్త ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. అలాగే, మైత్రీ మూవీ మేకర్స్, హారిక హాసిని పతాకంపై నిర్మించే చిత్రంతో పాటు.. ఏఎం రత్న నిర్మించే చిత్ర, "గబ్బర్ సింగ్‌"కు సీక్వెల్ అయిన 'రాజా సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాల్లో నటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు