అడుగడుగున కృతజ్ఞతతో తన నమ్రతను చాటుకున్న పవన్ కళ్యాణ్

డీవీ

గురువారం, 6 జూన్ 2024 (19:43 IST)
Anjanadevi took disti with pumpkin
పవర్ స్టార్ కళ్యాణ్ అబిమానులకు పవర్ లాంటివాడు. కానీ ఇంటిలో తను చిన్నపిల్లవాడే. తన తల్లి అంజనాదేవి, వదిన సురేఖ, అన్న మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేసి తన అపారమైన భక్తిని చాటుకున్నారు. 
 
Pawan bowing to the feet of his mother and brother
చిరంజీవి ఇంటికి చేరి కారు దిగగానే ఆయను చిరంజీవి కుటుంబ హీరోలంతా తమ భార్యలతో వచ్చి ఆనందంలో పాలుపంచుకున్నారు. వరుణ్ తేజ్ మాత్రం చాలా హుషారుగా ఈల వేస్తూ ఎంజాయ్ చేశారు.
 
Pawan bowing to Vadina Surekha
ముందు తల్లి అంజనాదేవి గుమ్మడికాయతో దిష్టి తీసింది. ఆ తర్వాత పవన్ ఆమెకు పాదాభివనందం చేశారు. ఆ వెంటనే చిరంజీవి దగ్గరకు వెల్ళి సాష్టాంగం ప్రమాణం చేయడంతో చిరంజీవి తన తమ్ముడు పవన్ భుజంపై చేయి వేసి ఆశీస్సులు అందించారు. ఈ ప్రేమను చూస్తున్న నాగబాబు కండ్లు చెమర్చాయి. పవన్ పరిస్థితి కూడా అంతే. వీరి ప్రేమను చూసి పవన్ భార్య అన్నా లెజ్‌నేవా కూడా పాదాభివందనం చేసింది. 
 
Cake cutting
పవన్ తోపాటు అకిరా కూడా వచ్చారు. రామ్ చరణ్, ఉపాసనతోపాటు కుటుంబ సభ్యులంతా పవన్ కుటుంబాన్ని ఆప్యాయంగా ఆహ్వానంపలికారు. తదంతరం విజయోత్సవ కేక్ ను చిరంజీవి, అంజనాదేవి, సుప్రియ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు