హరీశ్ శంకర్ బాధ భరించలేక ఆ డైలాగ్ చెప్పా.... పవన్ కళ్యాణ్

ఠాగూర్

బుధవారం, 20 మార్చి 2024 (13:47 IST)
'ఉస్తాద్ భగవత్ సింగ్' టీజర్‌లో తాను చెప్పిన డైలాగ్.. దర్శకుడు హరీశ్ శంకర్ బాధ భరించలేక చెప్పానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చెప్పారు. ఈ చిత్రం నుంచి మంగళవారం సాయంత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. ఇందులోని ఓ డైలాగ్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారింది. దీనిపై జనసేన పార్టీ అధినేత, ఆ చిత్ర హీరో పవన్ కళ్యాణ్ ఈ సీన్ గురించి మాట్లాడుతూ, "ఒక వ్యక్తి గ్లాస్ కిందపడేస్తాడు. అది ముక్కలవుతుంది. ఇది నీరేంజ్ అని చెబుతాడు. ఈ చిత్రం షూటింగ్ చేస్తున్నపుడు ఈ సీన్ ఎందుకు రాశావు అని హరీశ్‌ శంకర్‌ను అడిగా... "అందరూ మీరు ఓడిపోయారు అంటున్నారు. వాళ్లందరికీ నేను ఒక్కటే చెబుతున్నా. గాజుకు ఉన్న లక్షణం ఏమిటంటే... పగిలేకొద్దీ పదునెక్కుద్ది. మీ నుంచి మేము ఇలాంటివి కోరుకుంటాం. మీరు తగ్గితే మాకు నచ్చదు" అని హరీశ్ చెప్పాడు. సాధారణంగా సినిమాల్లో ఇలాంటి డైలాగులు చెప్పడం నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. కానీ, ఈ చిత్రంలో హరీశ్ శంకర్ బాధపడలేక ఆ డైలాగ్ చెప్పా" అని వివరించారు. 
 
కాగా, ఈ చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసింది. దీంతో ఈ చిత్రం ప్రమోను విడుదల చేశారు. ఈ సందర్భంగా హరీశ్ శంకర్ మాట్లాడుతూ, "ఈ సినిమా నాకెంతో స్పెషల్ దాదాపు పదేళ్ల తర్వాత నా అభిమాన హీరోతో సినిమా చేస్తున్నా. సంగీతంతో దేవి ఈ చిత్రానికి ప్రాణం ఇచ్చాడు. నిర్మాతలు రవి, నవీన్ లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు" అని అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు