కళాతపస్వికి వెల్లువెత్తిన శుభాకాంక్షలు.. నిన్న అన్నయ్య-నేడు తమ్ముడు

బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:15 IST)
ప్రముఖ సీనీ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ను ప్రతిష్టాత్మక దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం వరించిన సంగతి తెలిసిందే. 2016 సంవత్సరానికి గాను ఈ పురస్కారానికి విశ్వనాథ్‌ను ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సందర్భంగా విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. కాగా, మే 3వ తేదీన రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డును ఆయన అందుకోనున్నారు. 
 
ఈ సందర్భంగా సినీ రంగానికి, ఇతర రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు విశ్వనాథ్‌కు అభినందనలు తెలిపారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి మంగళవారం విశ్వనాథ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన సంగతి తెలిసిందే. 
 
కాగా బుధవారం జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు త్రివిక్రమ్ పవన్‌తో పాటు వచ్చి విశ్వనాథ్‌కు పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు ఇరువురు విశ్వనాథ్‌ను శాలువాతో సత్కరించారు.

వెబ్దునియా పై చదవండి