బిగ్ బాస్ రియాల్టీ షోలో రాయల్ రాజ్‌పుత్!

శుక్రవారం, 11 జూన్ 2021 (08:51 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోకి తారాజువ్వలా వచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. "ఆర్ఎక్స్ 100" అనే చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ కొట్టింది. అయితే ఆ తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో అవకాశాలు రాలేదు. అరకొర అవకాశాలు వచ్చినా మెయిన్ హీరోయిన్‌గా మాత్రం రాలేదు.
 
ఇకపోతే ఇటీవల పాయల్ "బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్ 5"లో కంటెస్టెంట్‌గా ఉండబోతుంది అంటూ కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. దీనిపై పాయల్ రాజ్‌పుత్ స్పందించారు. 
 
"నేను తెలుగు బిగ్ బాస్ సీజన్ 5లో లేనని అదంతా ఫేక్ న్యూస్ మాత్రమేనని దయచేసి ఇలాంటి రూమర్స్‌కి నన్ను లాగవద్దు అని చెప్పుకొచ్చింది. ఇకపోతే, ప్రస్తుతం పాయల్ తమిళ్ హర్రర్ థ్రిల్లర్ సినిమాతో పాటు మరి కొన్ని చిత్రాల్లో నటిస్తుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు