టాలీవుడ్‌కు పరిచయమైన కుర్రకారు హీరోయిన్లలో పాయల్ రాజ్‌పుత్ ఒకరు. ఈమె "ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా హీరోయిన్‌గా పరిచయమైంది. ఈ చిత్రంలో ప్రతినాయిక ఛాయలున్న పాత్రలో చక్కటి అభినయంతో ఆకట్టుకున్నది. తొలి అడుగుతోనే ఆమెకి పెద్ద విజయం దక్కింది. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా నటిస్తున్న 'వెంకీమామ' చిత్రంలో నటిస్తోంది. అలాగే, మాస్ మహారాజా రవితేజ నటించే చిత్రంలోనూ ముఖ్యపాత్ర పోషించనుంది.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రానికి సంబంధించి ఇటీవల పలు రూమర్స్ చక్కర్లు కొట్టాయి. 'ఆర్డీఎక్స్ లవ్' చిత్రం ఆర్ఎక్స్ 100కు సీక్వెల్ అని జోరుగా ప్రచారం జరిగింది. దీనిపై ఈ పంజాబీ భామ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది. ఆర్ఎక్స్ 100, ఆర్డీఎక్ లవ్ చిత్రాలు రెండూ ఒకదానికొకటి సీక్వెల్ కాదని తేల్చిచెప్పింది.