'ఆర్‌ఎక్స్ 100' దర్శకుడితో స్టార్ కపుల్స్..?

గురువారం, 18 ఏప్రియల్ 2019 (12:45 IST)
టాలీవుడ్‌లో ప్రస్తుతం మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకోవడం అంత ఆషామాషీ విషయం కాదు. కానీ 'ఆర్ఎక్స్ 100' చిత్రంతో దర్శకుడు అజయ్ భూపతి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమా కమర్షియల్‌గా మంచి విజయం సాధించడంతో అతని తదుపరి సినిమాపై అనేక పుకార్లు బయటకు వచ్చాయి. ఒక దశలో అజయ్ భూపతి నితిన్‌ని హీరోగా పెట్టి ఒక సినిమా తీయనున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు. ఆ తర్వాత అజయ్ రెండవ చిత్రంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటిస్తున్నాడని వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఏమైందో తెలియదు కానీ ఆ సినిమాలు కూడా పట్టాలెక్కలేదు.
 
తాజాగా అజయ్ భూపతి నాగచైతన్యతో ఒక సినిమా చేయనున్నాడనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హల్‌చల్ చేస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కోసం అనుకున్న కథలోనే కొన్ని మార్పులు చేసి నాగచైతన్య ఇమేజ్‌కు సరిపోయే లాగా అజయ్ దీన్ని మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడని తెలుస్తోంది. బెల్లంకొండతో సినిమా అనుకున్నప్పుడు అందులో హీరోయిన్‌గా సమంతను తీసుకుందాం అనుకున్నాడట. 
 
మరి ఇప్పుడు నాగచైతన్య కోసం కూడా సమంతనే తీసుకుంటారా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సమంత కమర్షియల్ హీరోయిన్‌గా నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరోవైపు నాగచైతన్యకి కూడా యాక్షన్ సినిమాలు రావడం లేదు. మరి ఇలాంటి తరుణంలో స్టార్ కపుల్స్‌ని అజయ్ భూపతి ఈ సినిమా కోసం ఒప్పిస్తాడా లేదా చూడాలి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు