Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

దేవీ

శుక్రవారం, 11 ఏప్రియల్ 2025 (08:03 IST)
Peddi latest
హైదరాబాద్ లోని మౌలాలి లాలాపేటలో రైల్వే వేగన్ వర్క్ షాప్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరిస్తున్నారు. రవివర్మ ఫైట్ మాస్టర్ నేత్రుత్వంలో రామ్ చరణ్ తోపాటు కొంతమంది ఫైటర్లు జనాల మధ్యలో చిత్రీకరణ జరుగుతోంది.

వేగన్ వర్క్ షాప్ లో రిపేర్ వర్క్ నిమిత్తం రామ్ చరన్ రావడంతో అక్కడ జరిగిన గలాటాతో యాక్షన్ సీన్ క్రియేట్ చేయబడిందని తెలుస్తోంది. ఇప్పటికే రామ్ చరణ్ గ్లింప్స్ పేరుతో క్రికెట్ నేపథ్యంగా సినిమా సాగుతోందని స్పష్టమైంది. 
 
ఈ సినిమాలో శివరాజ్ కుమార్ తో కూడా ఇటీవలే బూత్ బంగ్లాలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. పెద్దిరెడ్డిగా అందరూ పిలుచుకునే ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర యూనిట్ ఇటీవలే ప్రకటించింది. రామ్ చ‌ర‌ణ్‌, జాన్వీ క‌పూర్‌, శివ రాజ్‌కుమార్‌, జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ త‌దిత‌రులు నటిస్తున్నారు.
 
ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం:  బుచ్చిబాబు సానా, స‌మ‌ర్ప‌ణ‌:  మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్‌, బ్యాన‌ర్ : వృద్ధి సినిమాస్‌, నిర్మాత‌:  వెంట‌క స‌తీష్ కిలారు, మ్యూజిక్‌:  ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఆర్‌.ర‌త్న‌వేలు, ఎడిట‌ర్: న‌వీన్ నూలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  వి.వై.ప్ర‌వీణ్ కుమార్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు