ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ ఆడియో రైట్స్‌కు కళ్లు చెదిరే ధర దక్కింది. ప్రముఖ నిర్మాణ సంస్థ టీ-సిరీస్ రూ.35 కోట్లకు దక్కించుకుందని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా, రెహ్మాన్ - చరణ్ కాంబినేషన్‌లో ఇదే తొలి మూవీ కావడం గమనార్హం.
ఈ చిత్రంలో చెర్రీ సరసన హీరోయిన్‌గా బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ నటిస్తుండగా, కన్నడ నటుడు శివరాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేందు, జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు. మైత్రీ మూవీస్ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.