Charan: పెద్ది ఫర్ ప్రదీప్ అని రామ్ చరణ్ చెప్పడం చాలా హ్యాపీ : ప్రదీప్ మాచిరాజు

దేవీ

గురువారం, 10 ఏప్రియల్ 2025 (15:34 IST)
Pradeep Machiraju, Deepika Pilli
హీరో ప్రదీప్ మాచిరాజు మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి'. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. మాంక్స్ & మంకీస్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ఎంటర్‌టైనర్‌లో దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఏప్రిల్ 11న థియేటర్లలోకి  రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ నిర్వహించారు.
 
ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ లో హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ, ఈ సినిమాతో చాలామంది కొత్తవారు పరిచయం అవుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళ పేర్లు చాలా గట్టిగా వినిపిస్తాయి. నితిన్ భరత్ ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. సరికొత్త స్టైల్ ని స్క్రీన్ పై చూపించబోతున్నారు. సందీప్ రాసిన కథ డైలాగ్స్ చాలా రీసౌండ్ చేస్తాయి. భరత్ నితిన్ ఈ సినిమా ద్వారా నాకు బ్రదర్స్ లాగా దొరికారు. మా యూనిట్ మొత్తానికి రాజకుమారి దీపిక. మేము కూడా తనని రాజకుమారిలాగే చూసుకున్నాం. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. 
 
సూపర్ స్టార్ మహేష్ బాబు గారి సపోర్టుతో తొలి అడుగు వేసాం. ఆయన మా సాంగ్ ని లాంచ్ చేయడం మాకెంతో బలాన్ని ఇచ్చింది. మా సినిమా మొట్టమొదటి టికెట్ ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పర్చేజ్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఆయన ఈ సినిమా గురించి తెలుసుకుని  ఇంటికి పిలిపించి మాట్లాడారు. ఆ సపోర్ట్ ని మేము మర్చిపోలేం. రామ్ చరణ్ గారు 'పెద్ది ఫర్ ప్రదీప్' అని చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. షూటింగ్లో చాలా బిజీగా ఉంటూ కూడా మాకు సమయాన్ని కేటాయించి సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ సినిమా ట్రైలర్ చూశారు. చాలా హ్యాపీగా ఫీలయ్యారు. రామ్ చరణ్ గారు మా అందరితో సరదాగా ఇన్వాల్వ్ అవుతూ టికెట్ ని ఫస్ట్ టికెట్ ని పర్చేజ్ చేయడం మాకు ఒక బ్యూటిఫుల్ మెమొరీ. మాకోసం ఒక్క రెండున్నర గంటలు స్పెండ్ చేయండి. సూపర్ గా ఎంటర్టైన్ చేస్తాం. ఇది నా ప్రామిస్.  మైత్రి మూవీ మేకర్స్ మా సినిమాని రిలీజ్ చేయడం మా బిగ్గెస్ట్ స్ట్రెంత్. వారిస్తున్న సపోర్టుకి మా టీం తరఫున మా టీం అందరి తరపునుంచి థాంక్యూ సో మచ్. మా సినిమా రిలీజ్ ముందే ఓటిటి శాటిలైట్ క్లోజ్ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతమంది మా కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తున్నారంటే తప్పకుండా ఇది ప్రేక్షకులు కూడా నచ్చుతుందని నమ్ముతున్నాం. అందరికీ థాంక్యూ వెరీమచ్'అన్నారు
 
హీరోయిన్ దీపిక మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మా సినిమాని సపోర్ట్ చేసిన రామ్ చరణ్ గారికి థాంక్యూ. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. ఇంత మంచి టీం తో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ప్రదీప్, భరత్ నితిన్ లకు థాంక్యూ.  నేను లీడ్ యాక్టర్ గా చేసిన ఫస్ట్ సినిమా ఇది. ఇంత మంచి క్యారెక్టర్ ప్లే చేయడం ఒక బ్లెస్సింగ్ గా ఫీల్ అవుతున్నాను. ఇది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. సమ్మర్ హాలిడేస్ లో హ్యాపీగా ఫ్యామిలీతో కలిసి వెళ్లి హాయిగా నవ్వుకోండి. అందరూ కూడా సినిమాని థియేటర్లో చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను'అన్నారు

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు