దక్షిణాది సినిమాల్లో నటించిన వారిని బాలీవుడ్‌లో చిన్నచూపు చూస్తుందని పాయల్ వెల్లడించింది. బాలీవుడ్‌లో నటించే అవకాశం కోసం ప్రయత్నిస్తుంటే దక్షిణాది సినిమాల్లో నటించానన్న విషయాన్ని చెప్పొద్దని తనకు కొందరు సలహాలు ఇచ్చారని తెలిపింది. ఈ పరిణామాలతో బాలీవుడ్ కంటే దక్షిణాది సినిమాల కోసం ప్రయత్నాలు జరపితేనే బాగుంటుందని తనకు అనిపిస్తోందని పాయల్ అభిప్రాయం వ్యక్తం చేసింది.
తమిళ, తెలుగుతో కూడిన దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటించే హీరోయిన్ల పట్ల బాలీవుడ్‌కు చిన్నచూపు వుందని చెప్పుకొచ్చింది. తెలుగులో జూనియర్ ఎన్టీఆర్‌తో ఊసరవెల్లిలో నటించిన ఈ భామ తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించింది.