పూనమ్ కౌర్. తెలుగు తమిళ నటి. ఆమె చిత్ర సీమలో అడుగుపెట్టక ముందు ఓ మోడల్. హైదరాబాద్ వాసి. అయితే, ఆమె పలు చిత్రాల్లో నటించినప్పటికీ తగినంత స్థాయిలో గుర్తింపురాలేదు. అదేసమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించడంతో పూనమ్‌కు కాస్త ఊరట లభించింది. అంతకంటే ఆమె పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ఇటీవలికాలంలో పవన్‌పై ఇద్దరు వ్యక్తులు తీవ్ర స్థాయిలోవిరుచుకుపడుతున్నారు. వారిని ఉద్దేశించి పూనమ్ పరోక్షంగా ఘాటు ట్వీట్‌లు చేసింది.
'ఇతరులను విమర్శించడం ద్వారా డబ్బులు సంపాదించాలకునే వారి కంటే అడుక్కునే వారు ఎంతో ఉత్తములు. ఆ ఫ్యాట్సోను రోజూ టీవీలో చూసి బోర్ కొడుతోంది. పాపం.. నిరుద్యోగ సమస్య. ఎవరో అనారోగ్యంతో బాధపడుతున్నారు. బరువు తగ్గించుకోవడానికి అతనికి డబ్బులు డొనేట్ చేయండి. మనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారికి కూడా మనం ఆహారం అందిస్తున్నాం. ఇది చాలా గొప్ప విషయం. అతనికి మంచి పని దొరకాలని కోరుకుంటున్నాను' అంటూ పరోక్షంగా కత్తి మహేష్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ల వర్షం కురిపించింది.