ప్రముఖ రచయిత భూపతిరాజాకు పితృవియోగం

సోమవారం, 16 జనవరి 2023 (09:04 IST)
ప్రముఖ సినీ రచయిత బాలమురుగన్ కన్నుమూశారు. ఈయనకు వయసు 86 యేళ్లు. తెలుగులో ప్రముఖ మాటల రచయితగా గుర్తింపు పొందిన భూపతి రాజా తండ్రే ఈ బాలమురుగన్. ఈయన కూడా తెలుగు, తమిళ సినిమాలకు పని చేశారు. తెలుగులో గీతా ఆర్ట్స్ నిర్మించిన తొలి సినిమాకు కథను సమకూర్చారు. 
 
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన తెలుగు, తమిళం సహా పలు భాషల్లో అనేక సినిమాలకు రచయితగా పని చేశారు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం చెన్నైలోని రాజా అన్నామలైపురంలో ఉన్న ఆయన నివాసంలో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుమారుడు, మాటల రచయిత భూపతిరాజా తెలిపారు. 
 
బాలమురుగన్ తెలుగులో ధర్మదాత, సోగ్గాడు, ఆలుమగలు, సావాసగాళ్లు, జీవనతరంగాలు వంటి అనేక హిట్ చిత్రాలకు కథను అందించారు. గీతా ఆర్ట్స్ తొలిసారి నిర్మించిన "బంట్రోతు భార్య" సినిమాకు ఆయనే కథను సమకూర్చారు. తమిళ దిగ్గజ నటుడు శివాజీ గణేశన్‌కు దాదాపు 40కిపైగా చిత్రాలకు కథలను అందించారు. బాలమురుగన్ మరణవార్త తెలుసుకున్న తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు