ఈ మేరకు తన ఫేస్‌బుక్ ఖాతాలో బడా దర్శకుడి సెటిల్మెంట్ గురించి మా గ్రూపుకు బాగా తెలుసునని చెప్పింది. దీన్ని రాజకీయానికి వాడుకోవద్దని చెప్పింది. ఈ విషయంలో అవసరమైతే పేరు కూడా బయటపెడతా, పోరాటంలో ప్రాణాలకి తెగించానని తెలిపింది.
బడాబాబులు తమ వద్దే తమ కరెన్సీ కట్టలు పెట్టుకోండని శ్రీరెడ్డి తెలిపింది. అమ్ముడు పోయే వాళ్లెవరో ప్రజలకు తెలుసు. మెగా ఫ్యామిలీ అర్థం చేసుకుంటే చాలు. రెండు వందల పిచ్చి కామెంట్స్‌ని తాము ఏమాత్రం లెక్కచేయమని శ్రీరెడ్డి చెప్పింది. తమ నిజాయితీ నిరూపించుకుంటామని.. అమ్మాయిలను తక్కువ చేసినా, వాడుకోవాలని ట్రై చేసినా.. ఒక్కొక్కడి తాట తీస్తామని శ్రీశక్తి తెలిపింది. తనకు ఏమైనా అయితే అందుకు మెగా ఫ్యామిలీనే బాధ్యత వహించాలని.. ఇప్పటికే బెదిరింపులు వస్తున్నాయని శ్రీశక్తి వెల్లడించింది.
వైఎస్ఆర్ అన్నా, మీరన్నా జనాల్లో విపరీతమైన అభిమానం ఉందన్నా. మీ ఫ్యాన్స్ ఎంత క్రమశిక్షణగా ఉంటారు? ఎలాంటి బహిరంగసభలు, ఓదార్పు యాత్రలు చేశారు ఎంతో శాంతంగా?? ఈరోజు జగన్ అన్న తన అనుచరులని ఎవరి మీదకి ఉసిగొల్పలేదు.. దటీజ్ జగన్.. శాంతి ఓర్పు సహనం వైఎస్ ఆయుధాలు. యువతకు ఆదర్శమూర్తి'' అని శ్రీశక్తి తెలిపింది.