ప్రశాంత్ నీల్ మాట్లాడుతూ - ``ప్రభాస్‌తో సినిమా అంటే ఆయన అభిమానులు, ప్యాన్ ఇండియా ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తారో, సినిమాపై ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనుకున్న ప్లానింగ్ ప్రకారం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రభాస్‌ను ఆయన అభిమానులు ఎలా చూడాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో ఆ అంచనాలను మించేలా సినిమాను తెరకెక్కిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా 2022, ఏప్రిల్14న మీ అందరితో కలిసి సలార్ వేడుకలను సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను``అన్నారు.