బాహుబలి 2 షూటింగ్ చివరి దశకు చేరింది. ఇక రిలీజ్ కోసం ప్రమోషన్‌లో ఓవైపు పాల్గొంటూనే.. మరోవైపు వేరు సినిమాలపై దృష్టి పెట్టాడు. యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో.. రన్ రాజా రన్ దర్శకుడు సుజిత్ దర్శకత్వంలో ప్రభాస్ నటించనున్నారు. అయితే బాహుబలి సినిమాతో ప్రభాస్‌కి నేషనల్ వైడ్ పాపులారిటి రావడంతో ఇకపై బాహుబలి నటించే సినిమాలను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తికావడంతో ఈ ఏడాది చివర్లో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్ పక్కన నటించే హీరోయిన్‌ని వెతికే పనిలో ఉంది సినిమా యూనిట్. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ అగ్రకథానాయిక ప్రియాంక చోప్రా చెల్లెలు, పరిణితీ చోప్రా ప్రభాస్‌తో రొమాన్స్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. మరి పరిణితి చోప్రా బాహుబలితో నటిస్తుందో లేదో వేచి చూడాలి.