బిగ్‌బాస్ హౌస్‌లోకి ప్రదీప్ వచ్చేశాడు.. ప్రోమో చూడండి..

గురువారం, 19 జులై 2018 (14:50 IST)
నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్-2 తెలుగు రియాల్టీ షోకు మంచి ఆదరణ లభిస్తోంది. ఊహించని పరిణామాలు.. అనూహ్య టాస్క్‌లు, ప్రేక్షకులకు షాకయ్యే ఎలిమినేషన్లతో ఈ షో ఆసక్తికర మలుపులతో దూసుకెళ్తోంది. బుధవారం ఎపిసోడ్‌లో లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లో ఇచ్చిన ''బిగ్ బాస్ బ్లాక్ బస్టర్ సినిమా'' కాన్సెప్ట్‌తో ఇంటి సభ్యులు చేసిన హంగామా వీక్షకులను బాగానే ఆకట్టుకుంది.
 
ఇక తాజాగా, బిగ్‌బాస్ హౌస్‌లోకి యాంకర్ ప్రదీప్ అడుగుపెట్టాడు. ప్రదీప్ ఇంట్లోకి అడుగుపెట్టిన వీడియో ప్రోమోని స్టార్ మా విడుదల చేసింది. ప్రదీప్ హౌజ్‌లోకి అడుగుపెట్టిన వెంటనే సందడి మొదలైంది. ప్రదీప్ చెప్పిన పలు విషయాలకు ముందుగా దీప్తి సునైనా కంటతడి పెట్టుకుంది. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కన్నీరు పెట్టుకున్నారు. అయితే.. ఆనందంతో వారు ఏడ్చినట్లు అర్థమౌతోంది. ప్రోమోను వీడియోలో చూడండి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు