ముహూర్తపు సన్నివేశానికి ఆకాష్ పూరి క్లాప్ కొట్టగా, దేవరాజ్ కెమరా స్విచాన్ చేశారు. తనికెళ్ళ భరణి మేకర్స్ కి స్క్రిప్ట్ అందించి తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తుండగా, బాల సరస్వతి డీవోపీగా పని చేస్తున్నారు. శ్రీ వర్కాల ఎడిటర్ కాగా, గురు మురళీకృష్ణ ఆర్ట్ డైరెక్టర్.
అనంతరం చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ.. ఇది నా మొదటి సినిమా. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వుండే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇది. తెలుగు, కన్నడ ఏకకాలంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. మొదటి షెడ్యుల్ జనవరి మూడో వారం నుంచి హైదరాబాద్, తర్వాత వైజాగ్ పరిసర ప్రాంతాల్లో నిర్విరామంగా జరుగుతుంది'' అన్నారు
తనికెళ్ళ భరణి మాట్లాడుతూ.. సినిమా నిర్మాణం అంటే చాలా ప్యాషన్ వుండాలి. అలాంటి ప్యాషన్ తో నిర్మాత హరి గౌడ్, హరి క్రియేషన్స్ బ్యానర్ ని స్థాపించి నిర్మాణ రంగంలోకి రావడం ఆనందంగా వుంది. దేవరాజు గారు పాన్ ఇండియా నటుడు. ఎన్నో అవార్డులు సాధించారు. ఆయన వారసత్వాన్ని వాళ్ళ అబ్బాయి ప్రణం దేవరాజ్ పుణికిపుచ్చుకుని ఈ రంగంలోకి రావడం చాలా సంతోషంగా వుంది. ఇది తనకి మూడో చిత్రం. ఇప్పటికే కన్నడలో మంచి పేరు తెచ్చుకున్నారు. శంకర్ చాలా ప్రతిభ వున్న దర్శకుడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించి అందరికీ పేరు ప్రతిష్టలు రావాలి' అని కోరారు
నిర్మాతలు మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. మమ్మల్ని ఆశీర్వదించిన తనికెళ్ళ భరణి గారు, నరసింహారెడ్డి గారు, ఆకాష్ పూరిగారు, దేవరాజ్ గారికి కృతజ్ఞతలు, అందరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.
టెక్నికల్ టీం:రచన, దర్శకత్వం: శంకర్, నిర్మాత: పి.హరికృష్ణ గౌడ్,మ్యూజిక్ : శేఖర్ చంద్ర, కొరియోగ్రాఫర్: జిత్తు మాస్టర్, ఫైట్స్: నటరాజన్, పీఆర్వో: తేజస్వి సజ్జ