పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలో బాపుగారి బొమ్మో అంటూ పాట పాడుకున్న నటి ప్రణీత సుభాష్ పెళ్లి చేసుకుంది. నితిన్ రాజ్ అనే వ్యాపారవేత్తను ప్రేమించి వివాహం చేసుకుంది. టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రణీత 'ఏం పిల్లో.. ఏం పిల్లడో' సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రణీత.. ఆ తర్వాత 'బావ', 'అత్తారింటికి దారేది', 'పాండవులు పాండవులు తుమ్మెద', 'రభస' వంటి చిత్రాలలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.