మంగళవారం అర్థరాత్రి అంధేరిలోని ఓ పబ్ బయట ఉన్న మోడల్, ఈమె బాయ్‌ఫ్రెండ్ పట్ల రాహుల్ అనుచితంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి. రాహుల్ తన గాళ్ఫ్రెండ్తో కలసి పార్టీకి వెళ్లగా, మోడల్ తన ఫ్రెండ్ అయిన నిర్మాతతో కలిసి వచ్చింది. వీరిద్దరి ఎప్పటి నుంచే శత్రుత్వం ఉండటంతో గొవడవకు దిగారు. ఈ గొడవ పోలీసు స్టేషన్ వరకు చేరింది.
మరోవైపు తనపై ఫిర్యాదు చేసినవారిపై రాహుల్ కూడా ఫిర్యాదు చేశాడు. రాహుల్, అతని గాళ్‌ఫ్రెండ్.. మోడల్, ఆమె బాయ్ఫ్రెండ్ దూషించుకోవడంతో పాటు కొట్టుకున్నారు. ఏప్రిల్ 1న ముంబైలోని ఫ్లాట్లో ప్రత్యూష ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో రాహులే కారణమని ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం రాహుల్ బెయిల్పై విడుదలయ్యాడు.