Naveen Polishetty, Meenakshi Chaudhary
కథానాయకుడు నవీన్ పొలిశెట్టి తీవ్ర గాయాల కారణంగా సంవత్సరం పాటు నటనకు దూరమయ్యారు. ఇప్పుడు పూర్తిగా కోలుకొని, తన నూతన చిత్రం 'అనగనగా ఒక రాజు'తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.