కృష్ణజింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌కి కష్టాలు తప్పడం లేదు. ఈ కేసులో సల్మాన్‌కి మొదట రాజస్థాన్ హైకోర్టులో ఆయనని నిర్దోషిగా నిర్థారించిన ఆయనకు కష్టాలు తప్పడం లేదు. 1998, సెప్టెంబర్ 26వ తేదీన జోధ్‌పూర్ సమీపంలో సల్మాన్ కృష్ణజింకను వేటాడినట్లు సల్మాన్‌పై ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ''హమ్ సాథ్ సాథ్ హై'' అనే సినిమాలో నటిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జోధ్‌పూర్‌లోని కంకణి గ్రామంలో కృష్ణజింకను వేటాడిన కేసులో సల్మాన్‌తో పాటు సైఫ్‌అలీఖాన్, టబు, సోనాలీబింద్రే మరో ముగ్గురు కూడా ఆరోపణలు ఎదుర్కున్నారు. జింకలను వేటాడిన కేసులో సరైన సాక్ష్యం లేవని ఆయనను కోర్టు అప్పట్లో నిర్దోషిగా ప్రకటించింది. ఇప్పుడీ కేసు మరో మలుపు తిరిగింది. జింకలను సల్మానే చంపాడంటూ ఇన్నాళ్లూ అజ్ఞాతంలో వున్న జీపు డ్రైవర్ హరీశ్‌దులానీ ఇప్పుడు తెరపైకి రావడంతో సల్మాన్‌కి చుక్కెదురైంది. హరీష్ సాక్ష్యాలతో కేసు మళ్లీ మొదటికి వచ్చేసింది. సల్మాన్ కృష్ణజింకలను వేటాడిన తనకు తెలుసని... తాను భయపడి తప్పించుకుపోలేదని.. తనకు అన్ని విధాల రక్షణ కల్పించి ఉంటే కోర్టులో సాక్ష్యం చెప్పేవాడినని వాపోయాడు.
తనతో పాటు తన కుటుంబాన్ని కూడా బెదిరించారని, అందుకే భయపడి జోధ్‌పూర్‌ను వదిలి పారిపోయానని వెల్లడించాడు. 1998లో సల్మాన్ జింకలను వేటాడిన సమయంలో ప్రత్యక్ష సాక్షి డ్రైవర్ హరీష్ మాత్రమే ఉన్నాడు. ఈ విషయంపై ఆ రాష్ట్ర హోంమంత్రి గులాబ్ చంద్ కటారియా మాట్లాడుతూ... హరీశ్ తనకు రక్షణ కావాలంటూ రాతపూర్వకంగా తమను కోరలేదని, ఒక వేళ ఆయన తమను కోరితే అందుకు కూడా తాము సిద్ధమేనని ఆయన అన్నారు.