బాలీవుడ్‌లో ప్రస్తుతం బయోపిక్‌ల పర్వం కొనసాగుతోంది. రచయిత సాహిర్ లుధియాన్వి జీవిత కథ ఆధారంగా రూపుదిద్దుకోనున్న సినిమాలో అందాల సుందరి ప్రియాంక చోప్రా నటించనుంది. అదీ వేశ్య పాత్రలో. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. ఇప్పటికే స్క్రిప్టు వినిన ప్రియాంక చోప్రా వేశ్యగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని బిటౌన్‌లో వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం అమెరికా టీవీ సిరీస్ క్వాంటికో, బేవాచ్ సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా.. బాలీవుడ్‌లో రెండేళ్ల గ్యాప్ తర్వాత భన్సాలీ సినిమాలో నటించనుంది. జై గంగాజల్ సినిమాకు తర్వాత మళ్లీ బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనుంది. ఇక భన్సాలీ-ప్రియాంక చోప్రా కాంబోలో రానున్న సినిమాలో షారూఖ్ కీలక పాత్ర పోషిస్తాడని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని బిటౌన్ వర్గాల సమాచారం.