కాగా తాజాగా ఆయన గ్రీన్ సినిమాస్ అనే బ్రాండ్ తో థియేటర్ ల బిజినెస్ లోకి కూడా వచ్చారు. గ్రూప్ ఆఫ్ థియేటర్స్ ను నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “సాయి ఆశీర్వాదంతో, మేము గ్రీన్ సినీమాస్ - పాడి రాధా పేరిట పాడి వద్ద మా బ్రాండ్“ గ్రీన్ సినిమాస్ ”క్రింద మొదటి థియేటర్‌ను ప్రారంభిస్తున్నాము. ఇందులో రెండు స్క్రిన్స్ ఉన్నాయి, వీటిలో ఒకటి 384 సీట్లు, మరొకటి 142 సీట్లు.
సినిమా హాళ్లలో 4 కె ప్రొజెక్షన్ ఎ టి ఎం ఓ ఎస్ సౌండ్, 3 డి ప్రొజెక్షన్ సహా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉంది. చక్కగా నిర్వహించబడే విశాలమైన విశ్రాంతి గదులు, క్యాంటీన్‌లో రుచికరమైన స్నాక్స్ మరియు పానీయాలతో ప్రేక్షకులు ఆహ్లాదకరమైన మరియు అద్భుతమైన అనుభవాన్ని పొందవచ్చు.
లాబీ, విశాలమైన కారు పార్కింగ్, 2 వీలర్ పార్కింగ్ వుంది. సినిమాలను ఎంత గొప్పగా నిర్వహించానో మా థియేటర్ ను కూడా అంత గొప్పగా మెయింటైన్ చేస్తామని తెలిపారు. ఓటిటి. ఆదరణ వున్న తరుణంలో థియేటర్లు పెట్టడం సమజంసమేనా అని కొందరు అడిగారు. ఎప్పటికైనా థియేటర్‌కు విలువ ఎక్కువే. దానికి సాటి మరోటి రాదని జ్ఞనావేల్ రాజా తెలిపారు.