'అధినేత', 'ఏమైంది ఈవేళ', 'బెంగాల్ టైగర్' వంటి సూపర్‌హిట్ అందించి ప్రస్తుతం లక్ష్మీ రాధామోహన్ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్ పతాకంపై పృథ్వీ, నవీన్‌చంద్ర హీరోలుగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో నిర్మించిన 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సెన్సార్ పూర్తి చేసుకొని నవంబర్‌లోనే విడుదలకు సిద్ధమైంది.
కాగా, మరో మూడు చిత్రాలను నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాత కె.కె.రాధామోహన్. యంగ్ హీరో నాగశౌర్య హీరోగా జనవరిలో ఓ చిత్రాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ కథానాయకుడిగా ఇంకో చిత్రాన్ని నిర్మించనున్నారు.