శ్వేతా బసు ప్రసాద్ గ్లామర్‌‌తో ప్రేక్షకుల ముందుకు రానున్న 'పున్నమి రాత్రి'

బుధవారం, 13 జులై 2016 (16:21 IST)
శ్రద్ధాదాస్, మోనాల్ గుజ్జర్ (సుడిగాడు ఫేమ్) ఆర్యన్, శ్వేతా బసు ప్రసాద్, నాజర్, ప్రభు, కృష్ణ భగవాన్ ముఖ్య తారాగణంగా రూపొందిన గ్లామరస్ హారర్ ఎంటర్ టైనర్ "పున్నమి రాత్రి". వినయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. కలర్స్ అండ్ క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఎం.సుబ్బారెడ్డి నిర్మించారు. 2డి, మరియు 3డిలో ఈ చిత్రం రూపొందించడం విశేషం.
 
ఈ చిత్రాన్ని ఈ నెల 15న ఎం.జి.ఎం మూవీస్ ద్వారా అచ్చిబాబు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత ఎం.సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. "హారర్ ఎంటర్ టైనర్స్‌ను ఇష్టపడేవారిని అమితంగా అలరించే చిత్రం "పున్నమి రాత్రి". ఈ చిత్రాన్ని ఎం.జి.ఎం మూవీస్ ద్వారా అచ్చిబాబు విడుదల చేస్తున్నారు. 
 
శ్రద్ధాదాస్, మోనాల్ గుజ్జర్, శ్వేతా బసు ప్రసాద్‌ల గ్లామర్ ఈ చిత్రానికి ముఖ్య ఆకర్షణ. 2డి, 3డిలో ఈ చిత్రాన్ని చూడొచ్చు. ఈ నెల 15న విడుదలవుతున్న ఈ చిత్రం తప్పకుండా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది" అన్నారు. 

వెబ్దునియా పై చదవండి