యంగ్ హీరో ఇషాన్ హీరోగా మన్నారాచోప్రా, ఏంజెలినా హీరోయిన్స్‌గా జయాదిత్య సమర్పణలో తాన్వి ఫిలింస్ పతాకంపై డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో డా|| సి.ఆర్. మనోహర్, సి.ఆర్. గోపి సంయుక్తంగా నిర్మిస్తున్న రొమాంటిక్ ప్రేమకథా చిత్రం 'రోగ్'. మరో చంటిగాడి ప్రేమకథ అనేది క్యాప్షన్. ఇటీవల రిలీజ్ అయిన 'రోగ్' ఫస్ట్‌లుక్, టీజర్‌కి ట్రమండస్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో ఇషాన్ గెటప్, లుక్స్ అదిరిపోయేలా ఉన్నాయి. 'రోగ్'తో ఇండస్ట్రీకి మరో ఆరడుగుల అందగాడు రాబోతున్నాడు. చూడటానికి హాలీవుడ్ హీరోలా కనిపించే ఇషాన్ మన అచ్చ తెలుగు కుర్రాడు కావడం విశేషం.
ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం మార్చి 1న హైదరాబాద్ నోవాటెల్‌లో గ్రాండ్‌గా జరిగింది. 'రోగ్' తెలుగు ట్రైలర్‌ని చిత్ర నిర్మాత డా|| సి.ఆర్. మనోహర్ రిలీజ్ చేయగా కన్నడ థియేట్రికల్ ట్రైలర్‌ని కమెడియన్ ఆలీ రిలీజ్ చేశారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, హీరోయిన్స్ మన్నారా చోప్రా, ఏంజెలినా, సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్, పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామెన్ ముఖేష్, ఎడిటర్ జునైద్ సిద్ధికి, ఫైట్‌మాస్టర్ వెంకట్, ఆర్ట్ డైరెక్టర్ జానీ షేక్, పిఆర్‌ఓ బి.ఎ. రాజు పాల్గొన్నారు.
సంగీత దర్శకుడు సునీల్ కశ్యప్ మాట్లాడుతూ - ''జ్యోతిలక్ష్మి', 'లోఫర్' చిత్రాల తర్వాత 'రోగ్' చిత్రానికి మ్యూజిక్ చేసే అవకాశాన్ని ఇచ్చిన పూరి సార్‌కి నా థాంక్స్. పాటలన్నీ ఎక్స్‌లెంట్‌గా వచ్చాయి. అతి త్వరలో ఆడియో రిలీజ్ అవుతుంది. 'రోగ్' చిత్రం అందరికీ నచ్చుతుంది. లవర్స్ అందరూ ఎంజాయ్ చేసేవిధంగా ఉంటుంది'' అన్నారు. కమెడియన్ ఆలీ మాట్లాడుతూ - ''ప్రతి సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్‌ని పూరిగారు చాలా డిఫరెంట్‌గా చూపిస్తారు. ఇషాన్‌ని ఈ చిత్రంలో చాలా కొత్తగా చూపించారు. చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉన్న ఇషాన్ మన అచ్చ తెలుగు కుర్రాడు. అందంతోపాటు తనలో మంచి టాలెంట్ ఉంది. 'రోగ్' సినిమాని ఎంతో ప్రేమించి అద్భుతమైన సినిమా తీశారు పూరి జగన్నాథ్. సునీల్‌కశ్యప్ సూపర్ మ్యూజిక్ ఇచ్చారు. భాస్కరభట్ల మంచి లిరిక్స్ రాశారు. ఈ సినిమా పెద్ద హిట్ అయి ఇషాన్‌కి మంచి పేరు తీసుకురావాలి. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాత మనోహర్ గారికి, పూరి జగన్నాథ్ గారికి నా థాంక్స్'' అన్నారు.
నిర్మాత సి.ఆర్. మనోహర్ మాట్లాడుతూ - ''మా బ్రదర్‌ని హీరోగా లాంచ్ చేయాలని పూరి జగన్నాథ్ గారిని అడగ్గానే ఇమీడియట్‌గా ఆయన ఓకే అని సాయంత్రం రండి కథ చెప్తాను అన్నారు. ఆరోజు చాలా సంతోషం కలిగింది. మా ఇషాన్‌ని ఆయనకు అప్పగించాను. ఆరోజు నుండి ఈరోజు వరకు సొంత బిడ్డలా భావించి అత్యద్భుతమైన సినిమా చేశారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన హీరోలందరూ ఇండస్ట్రీలో స్టార్‌లుగా ఎదిగారు. 'రోగ్'తో ఇంట్రడ్యూస్ అవుతున్న మా ఇషాన్‌కి ఇండస్ట్రీలో పెద్దల బ్లెస్సింగ్స్, ప్రేక్షకుల ఆశీస్సులు కావాలి. మాది ఉమ్మడి కుటుంబం. 30 మంది కలిసే ఉంటాం. మా బాబాయ్‌గారి అబ్బాయి ఇషాన్. మా నాన్నకి ఇషాన్ అంటే చాలా ఇష్టం.
చాలా ఎక్కువగా ప్రేమిస్తాడు ఆయన. ఈ సినిమా మా ఇంట్లో అందరం చూశాం. మాకు బాగా నచ్చింది. అలాగే కొంతమంది కన్నడ దర్శకులు, నిర్మాతలు, హీరోలు ఈ సినిమా ట్రైలర్స్, కొన్ని సాంగ్స్, సీన్స్ చూశాను. ప్రతి ఒక్కటీ చాలా బాగున్నాయి అని ప్రశంసించారు. విజయేంద్రప్రసాద్ గారు కూడా సాంగ్స్, సీన్లు చూసి ఇషాన్‌ని గట్టిగా హగ్ చేసుకున్నారు. డెఫినెట్‌గా బిగ్ స్టార్ అవుతావు అని బ్లెస్ చేశారు. పూరి జగన్నాథ్‌గారి చేతిలో ఇషాన్‌ని పెట్టి రైట్ డెసిషన్ తీసుకున్నారు అన్నారు. త్వరలో నేను ఇషాన్‌తో ఒక సినిమా చేస్తా అని చెప్పారు. ఇంత మంచి సినిమా చేసిన పూరి గారికి లైఫ్‌లాంగ్ రుణపడి ఉంటాను.
ఇషాన్‌తో కంటిన్యూగా మూడు సినిమాలు చేస్తానని పూరిగారు అన్నారు. అలాగే హిందీలో కూడా లాంచ్ చేస్తా అన్నారు. సినిమా నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎక్కడికైనా తీసుకెళ్తారు. 'రోగ్'తో మా ఇషాన్‌ని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చార్మికౌర్‌గారు చాలా కేర్ తీసుకుని ఈ చిత్రాన్ని బాగా ప్రమోట్ చేస్తున్నారు. పూరి కనెక్ట్స్ స్టార్ట్ చేసి ఎంతో మంది టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. సునీల్‌కశ్యప్ మ్యూజిక్ ఎక్స్‌ట్రార్డినరీగా ఇచ్చారు. భాస్కరభట్ల మంచి సాహిత్యాన్ని అందించారు. ముఖేష్ కెమెరా విజువల్స్ వండర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఆలీగారి కామెడీ సూపర్‌గా ఉంది'' అన్నారు.
హీరోయిన్ ఏంజెలినా మాట్లాడుతూ - ''పూరి జగన్నాథ్‌గారు పరిచయం చేసిన హీరోయిన్స్ అందరూ మంచి పొజిషన్‌లో ఉన్నారు. ఆయన డైరెక్షన్‌లో సినిమా చేయడం నా అదృష్టం. ఇషాన్ ఫ్యూచర్‌లో సూపర్‌స్టార్ అవుతాడు'' అన్నారు. హీరోయిన్ మన్నారా చోప్రా మాట్లాడుతూ - ''ఆడిషన్‌లో సెలక్ట్ చేసి పూరిగారు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చారు. తెలుగులో ఫస్ట్ కమిట్ అయిన చిత్రం ఇది. ఈ చిత్రంలో నటించే ఛాన్స్ ఇచ్చిన పూరి సార్‌కి నా థాంక్స్. ఇషాన్ సచ్ ఎ లవ్‌లీ పర్సన్. గుడ్ హ్యూమన్ బీయింగ్. లవర్స్ అందరికీ ఈ చిత్రం నచ్చుతుంది'' అన్నారు.
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మాట్లాడుతూ - ''చాలా రోజుల తర్వాత ప్రేమకథ చేశాను. ఈ సినిమాకంటే ఎక్కువగా నేను హీరో ఇషాన్‌ని చూసి బాగా ఎగ్జైట్ అయ్యాను. హీరోకి వుండాల్సిన లక్షణాలు అన్నీ తనలో ఉన్నాయి. హైట్, పర్సనాలిటీతో పాటు స్క్రీన్ ప్రజెన్స్ చాలా బాగుంది. మనోహర్‌గారు ఇషాన్‌ను తెచ్చి ఇంట్రడ్యూస్ చేయమన్నారు. మనోహర్ గారిలాంటి బ్రదర్ ఉండడం ఇషాన్ అదృష్టం. ఫస్ట్ డే ఒక రొమాంటిక్ సాంగ్ షూట్ చేసేటప్పుడు మాత్రం కొంచెం బిడియంగా వణికిపోయాడు. ఆ తర్వాత క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయి సూపర్‌గా చేశాడు. అబ్రాడ్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు ఇషాన్‌ని చూసి కొంతమంది ఏ అమితాబ్ అని కేకలు వేశారు. వాళ్లు హీరోలా ఫీలయి సెల్ఫీలు దిగడం స్టార్ట్ చేశారు. అప్పుడే ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. వికీపీడియాలో ఇషాన్ పేరు ఇప్పుడు లేకపోవచ్చు.
కొన్ని రోజుల తర్వాత గూగుల్ సెర్చ్‌లో సౌత్ ఇండియాలో పెద్ద స్టార్ అని చెప్తుంది. శ్రీదేవి గారిని రాఘవేంద్రరావు గారు హీరోయిన్‌గా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆరోజు శ్రీదేవి చాలా హ్యాపీగా ఫీలయి ఉండవచ్చు. కానీ శ్రీదేవి లాంటి ఒక స్టార్‌ని ఇంట్రడ్యూస్ చేసినందుకు రాఘవేంద్రరావు గారు కూడా అలాగే ఫీల్ అవుతారు. అలాగే ఇషాన్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసినందుకు నేను చాలా హ్యాపీగా ఫీలవుతున్నాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్ ప్రకారం చెప్తున్నాను. ఇషాన్ చాలా పెద్ద స్టార్ అవబోతున్నాడు. స్టార్ అవుతాడు.
సినిమా చాలా బాగా వచ్చింది. ఒక వంద మందికి సినిమా చూపించాను. చూసిన ప్రతి ఒక్కరికీ 5 నిమిషాల్లో ఇషాన్ నచ్చాడు. మనోహర్‌గారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ సినిమా నచ్చింది. చాలా హ్యాపీగా వుంది. మన్నారా, ఏంజెలినా బ్యూటిఫుల్‌గా యాక్ట్‌చేశారు. ఠాకూర్ అనూప్‌సింగ్ విలన్‌గా చేశాడు. కొత్త టీమ్ అందరూ బాగా వర్క్ చేశారు. సునీల్ కశ్యప్ అద్భుతమైన పాటలు ఇచ్చాడు. ఇషాన్ బిగ్ స్టార్ కాబోతున్నాడు'' అన్నారు.
హీరో ఇషాన్ మాట్లాడుతూ - ''ఈరోజు ఇలా నిల్చుని మాట్లాడుతున్నానంటే మా అమ్మ, నాన్న, పెదనాన్న ముఖ్య కారణం. మాది జాయింట్ ఫ్యామిలీ. సో ఫ్యామిలీతో ఎటాచ్‌మెంట్ ఎక్కువ. ఫస్ట్ షెడ్యూల్‌కి వెళ్లినపుడు మా ఫ్యామిలీని కొంచెం మిస్ అయ్యాను. కానీ పూరిగారు మరో మంచి ఫ్యామిలీని నాకు ఇచ్చారు. ప్రతి ఒక్కరూ ప్రేమతో చూసుకున్నారు. మా అన్నయ్య మనోహర్‌గారు లేకపోతే నేను ఇక్కడ నిలబడే వాడ్ని కాదు. నిజంగా చెప్పాలంటే 'రోగ్'లో హీరో నేను కాదు మా అన్నయ్య. ఎలా థాంక్స్ చెప్పాలో తెలియడం లేదు.
మా ఫ్యామిలీ ఆశీస్సులు ఇలాగే నాకుండాలి. వైజాగ్‌లో సంవత్సరంపాటు సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ కోర్సు చేశాను. మధ్యలో కొన్ని కారణాల వల్ల ఇంటికి వచ్చాను. ఆ టైమ్‌లో మా అన్నయ్య, పూరిగారు ఎంతో మోటివేట్ చేసి తప్పకుండా ఇండస్ట్రీకి రావాలి అని సపోర్ట్ చేశారు. కానీ ఆరోజు నాకు తెలియదు ఇండస్ట్రీకి ఎందుకు రమ్మన్నారో. రాకపోయి ఉండి ఉంటే ఇంత మంచి ఫ్యామిలీని మిస్ అయి ఉండేవాడ్ని. పూరి సార్ ప్రేమకి చాలా కనెక్ట్ అయిపోయాను. పూరిగారు నన్ను హీరోగా ఇంట్రడ్యూస్ చేసినందుకు చాలా ఎగ్జైటెడ్‌గా వుంది. ఈ సినిమాకి వర్క్‌చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా థాంక్స్. ప్రతి సీన్‌లో నన్ను చాలా చాలా బాగా చూపించారు ముఖేష్‌గారు.
ఆలీ గారితో చేసిన కామెడీ సీన్లు బాగా వచ్చాయి. చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. చాలా ఎంకరేజ్ చేశారు. సీనియర్ యాక్టర్స్ అందరితో నా ఫస్ట్ మూవీ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. సునీల్‌కశ్యప్ మంచి పాటలు ఇచ్చాడు. వెంకట్ మాస్టర్ మంచి స్టంట్స్ కంపోజ్‌చేసి యాక్షన్ హీరోగా చూపించారు. భాస్కరభట్ల మెమరబుల్‌గా వుండే సాంగ్స్ రాశారు. 4 సార్లు సినిమా చూశాను. మూవీ చాలా బాగుంది. పూరిగారు స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడే ఆయనకి కనెక్ట్ అయిపోయా. స్టార్ డైరెక్టర్ అయి ఉండి కూడా నేను కొత్తవాడ్ని అయినా ప్రతిరోజు కాల్‌చేసి ఎన్నో సలహాలు, సూచనలు ఇస్తూ గైడ్ చేశారు పూరిగారు. సినిమా చూసిన వారందరూ ఫస్ట్ సినిమాలా లేదు. 2, 3 సినిమాలు చేసిన హీరోలా చేశావని అంటున్నారు. ఈ క్రెడిట్ అంతా పూరిగారికే దక్కుతుంది. నన్ను హీరోగా లాంచ్ చేసిన పూరి జగన్నాథ్ గారికి లైఫ్‌లాంగ్ రుణపడి ఉంటాను'' అన్నారు.