పుష్ప.. పుష్పరాజ్.. నీయవ్వ తగ్గేదే లే అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గడ్డం కింద చెయ్యి పెట్టి అడ్డంగా తిప్పితే.. వరల్డే షేకయింది. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్ అంటే స్టార్స్ అందరూ ఫైర్ లెక్క ఫీలయ్యారు..
ఇలా ఒక్కటేమిటి పుష్ప రాజ్‌గా అల్లు అర్జున్, ఆ పుష్పరాజ్‌ని క్రియేట్ చేసిన క్రియేటర్‌గా సుకుమార్ ఒక హిస్టరీనే క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ పుష్పకు కంటిన్యూగా రాబోతోన్న పుష్ప 2: ది రూల్‌పై ఆకాశమే అవధి అన్నట్లుగా అంచనాలున్నాయంటే.. పుష్ప ఎలా ప్రేక్షక హృదయాలను దోచుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోన్న పుష్ప 2: ది రూల్ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలయ్యాయి.
ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్, పుష్ప పుష్ప సాంగ్ యూట్యూబ్‌లో ఆల్ టైమ్ రికార్డులను నెలకొల్పగా.. ఇప్పుడు మరో ట్రీట్ ఇచ్చారు మేకర్స్. పుష్ప 2: ది రూల్ నుంచి కపుల్ సాంగ్ సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ లిరికల్ సాంగ్‌ను మేకర్స్ వదిలారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన చిన్న ప్రోమో ఎలా వైరల్ అయిందో తెలిసిందే. మేకింగ్ విజువల్స్‌తో వచ్చిన ఈ కపుల్ సాంగ్.. నా సామి పాటను బీట్ చేసేలా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేశారు. అంతకుమించి అనేలా ఆస్కార్ విజేత చంద్రబోస్ సాహిత్యం అందించారు.
I truly had manifested for a song where I could get the whole country grooving again.. and
HERE it is
I hope you like it as much as I lovvveeedddd dancing for this song.!
I love you.. and we present to you..
Srivalli and Pushpahttps://t.co/JbEqhDhKiS… pic.twitter.com/YVa28pythG
వీడు మొరటోడు అని వాళ్లు వీళ్లు.. ఎన్నెన్ని అన్న పసిపిల్లవాడు నా వాడు.. సూసేకి అగ్గిరవ్వ మాదిరి వుంటాడే నా సామీ..మెత్తానీ పత్తిపువ్వులామరి సంటోడే నా సామీ ఇట్టాంటి మంచి మొగుడుంటే ఏ పిల్లైనా మహరా..ణే
వంటి అద్భుతమైన సాహిత్యంతో వచ్చిన ఈ పాటను 5 భాషల్లోనూ ప్రముఖ గాయని శ్రేయా ఘోషల్ పాడటం మరో విశేషం. ఈ పాట మేకింగ్ విజువల్స్ చూస్తుంటే.. ఐ ఫీస్ట్ అన్నట్లుగా ఉంది. అల్లు అర్జున్, రష్మికా మందన్నా మరోసారి తమ డ్యాన్స్‌తో దుమ్మురేపారనేది అర్థమవుతోంది. ఈ పాటతో పుష్ప 2: ది రూల్‌పై క్రేజ్ డబులైంది. ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఇక పుష్ప ది రైజ్ చిత్రంలో తన నటనతో మొట్టమొదటిసారిగా తెలుగు కథానాయకుడు జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు తీసుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా దుబాయ్ మ్యాడమ్ టుసార్ట్స్‌లో దక్షిణ భారతదేశ నటుడి స్టాట్యూని, గ్యాలరీని ఏర్పాటు చేయటం తెలుగు వారందరికీ గర్వకారణం. ఇలాంటి ప్రత్యేకతలు పుష్ప చిత్రంతోనే సంతరించుకున్నాయి. ఇక త్వరలో
పుష్ఫ 2: ది రూల్‌తో మరోసారి ప్రపంచంలోని సినిమా అభిమానులంతా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటవిశ్వరూపాన్ని చూడబోతున్నారు. 90 సంవత్పరాల తెలుగు సినిమా చరిత్రలో మొదటిసారి తెలుగు నటుడి నటన చూసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎదురుచూస్తున్నాయంటే.. పుష్ప ఇంపాక్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.