అల్లు అర్జున్, రష్మిక నటించిన `పుష్ప` సినిమా ప్రీ రిలీజ్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, ఈరోజు బాధగా వుంది, ఆనందంగా వుంది. బెస్ట్ ప్రెండ్ సుక్కు ఇక్కడ లేడు. ముంబైలో సినిమా పనిలో వున్నాడు. పగలు, రాత్రి లేకుండా కష్టపడుతున్నాడు. నేను ఆర్.ఆర్.ఆర్. పనిమీద ముంబై వెళ్ళినప్పుడు అక్కడ అందరూ పుష్ప కోసం ఎదురు చూస్తున్నారని అంటుంటే నాకు చాలా ఆనందంగా వుంది. అందుకే బన్నీ నువ్వు కూడా ప్రమోట్ చేసుకోవాలి. మంచి ప్రొడక్ట్ నీ చేతుల్లో పెట్టుకున్నావ్.