R Narayana Murthy, University
స్నేహ చిత్ర పిక్చర్స్ బ్యానర్ లో పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యూనివర్సిటీ.ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. జూన్ 9న రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి మాట్లాడుతూ: 10వ తరగతిలో పేపరు లీకేజీలు - గ్రూపు 1-2 లాంటి ఉద్యోగ పరీక్షల్లోనూ పేపరులీకేజీలు ఇలా అయితే విద్యార్థుల భవిష్యత్ ఏం కావాలి ? నిరుద్యోగుల జీవితాలు ఏమైపోవాలి ? లంబకోణాలు నేర్పిన వాళ్ళే కుంభకోణాలు జేస్తూ ఉంటుంటే రెక్కలు తెగిన జ్ఞాన పావురాలు విలవిల కోట్టుకుంటూ ఊపిరాడక గింజు కుంటుంటే ఈ విద్యావ్యవస్థ, ఈ ఉద్యోగవ్యవస్థ