రాగల 24 గంటల్లో ట్రైలర్.. నా భర్తను నేనే చంపేశా.. (Video)

బుధవారం, 6 నవంబరు 2019 (15:24 IST)
''రాగల 24 గంటల్లో'' సినిమా ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్‌కు ఫ్యాన్స్ మధ్య స్పందన లభిస్తోంది.  ముస్కాన్ సేతి, గణేశ్ వెంకట్రామన్, కృష్ణభగవాన్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో నటించారు. కాగా శ్రీనివాస రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ను డైరెక్టర్ రాఘవేంద్రరావు విడుదల చేశారు. రఘుకుంచె ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. 
 
తన జీవితంలో ఏదైనా అదృష్టం ఉందంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడమేనంటూ నటి ఈషా రెబ్బాతో.. నటుడు సత్యదేవ్ చెప్పే డైలాగ్స్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది.

ఓ హత్య ఘటనపై దర్యాప్తు జరుగుతుండగా.. నా భర్తను నేనే చంపేశా.. అంటూ ఈషా పోలీసులతో చెప్పే మాటలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ట్రైలర్ ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగిస్తోంది. ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు