బిగ్ బాస్ మూడో సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన రాహుల్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. ఇంకా బిగ్ బాస్ కంటిస్టెంట్ పునర్నవి గురించి కూడా తెలియని వారంటూ వుండరు.
వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ అవన్నీ ఉత్తుత్తివేనని మేమిద్దరం మంచి స్నేహితులమని పున్ను, రాహుల్ తేల్చేశారు.
కాని రాహుల్‌కు బిగ్ బాస్ హౌజ్‌లో పున్ను చాలా సహాయం చేసిందని.. మోరల్ కాన్పిడెన్స్ ఇచ్చిందని రాహుల్ పలుమార్లు వివిధ సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
ఇదే విషయాన్ని మరోసారి రాహుల్ సోషల్ మీడియా వేదికగా జంటగా ఈ ఇద్దరు ఉన్న ఓ ఫోటో షేర్ చేస్తూ తనకు హౌజ్‌లో ఎంతో హెల్ప్ చేసిందని.. ఎప్పటికి మరిచిపోని మెమోరీస్‌ను అందించిందని పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే.. రాహుల్‌కు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా మరాఠి సినిమా నటసామ్రాట్‌కు రీమేక్‌గా వస్తోంది.
అలాగే పున్నుకు కూడా సినీ ఆఫర్లు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయని సమాచారం.