జైపూర్ చలనచిత్రోత్సవంలో బెస్ట్ పోలిటికల్ మూవీ గా రైమా సేన్.. మా కాళి

డీవీ

శనివారం, 18 జనవరి 2025 (16:40 IST)
Raima Sen's Maa Kali
నేషనల్ అవార్డ్ విన్నింగ్ సూపర్‌హిట్ చిత్రం కార్తికేయ 2 నిర్మాత, ప్రఖ్యాత నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ త్రిభాషా చిత్రం 'మా కాళి' ప్రతిష్టాత్మక జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో బెస్ట్  పోలిటికల్ మూవీ అవార్డును గెలుచుకుంది. టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ యెలకంటి దర్శకత్వం వహిస్తున్నారు. రైమా సేన్, అభిషేక్ సింగ్ ప్రధాన పాత్రలు పోషించారు.
 
జనవరి 17, 2025న, మా కాళి దర్శకుడు విజయ్ యెలకంటి నటి రైమా సేన్‌తో కలిసి జైపూర్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి హాజరయ్యారు. బెస్ట్ పోలిటికల్ మూవీ అవార్డును అందుకున్నారు.
 
రైమా సేన్  మాట్లాడుతూ..“మా కాళికి ప్రేక్షకులను ఆకట్టుకుంటుదని నాకు తెలుసు. ఈ గుర్తింపు మాకు ముఖ్యమైన, సానుకూల మార్పును ప్రేరేపించే కథలని చెప్పే శక్తినిస్తుంది. ఇది మహిళా ప్రధాన చిత్రం కాబట్టి, JIFF నుండి ఈ గుర్తింపు పొందడం మరింత సంతృప్తికరంగా ఉంది." అన్నారు
 
దర్శకుడు విజయ్ యెలకంటి మాట్లాడుతూ"మా కాళికి  బెస్ట్  పోలిటికల్ మూవీ  అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది,JIFF ద్వారా ఈ గుర్తింపు గొప్ప ఉత్సాహాన్ని ఇస్తోంది. మార్పును ప్రేరేపించే చిత్రాలను రూపొందించడానికి ప్రోత్సహిస్తుంది."
 
భారతీయ చరిత్రలో చెరిపివేయబడిన అధ్యాయం ఆధారంగా, మా కాళి శక్తివంతమైన కథ, ప్రభావవంతమైన పెర్ఫార్మెన్స్ లతో బెంగాల్‌లోని అన్‌టోల్డ్ చాప్టర్స్ ని ప్రజెంట్ చేస్తోంది. కలకత్తా, నోఖాలీలో జరిగిన క్రూరమైన నరమేధ రక్తపాత సత్యాన్ని హైలైట్ చేస్తూ, భారతదేశ విభజనకు దారితీసిన డైరెక్ట్ యాక్షన్ డే వెనుక ఉన్న సత్యాన్ని ముందుకు తీసుకురావాలనేది మా కాళి లక్ష్యం.
 
మా కాళి సోషియో-పోలిటికల్ సబ్జెక్ట్ ప్రస్తుత కాలంలోని అత్యంత ముఖ్యమైన చిత్రాలలో ఒకటిగా నిలిచింది. 1946 నుండి నేటి బంగ్లాదేశ్ వరకు హిందువులను పీడించడం, బెంగాల్ మతపరమైన అల్లకల్లోలాలను చిత్రీకరిస్తూ, మా కాళి Citizen Amendment Act (CAA)  ప్రాముఖ్యతను, దాని అమలు యొక్క అవసరాన్ని కూడా హైలైట్ చేస్తుంది.
 
విజయ్ యెలకంటి రచన, దర్శకత్వం వహించిన మా కాళిని TG విశ్వ ప్రసాద్, టీజీ కృతి ప్రసాద్ నిర్మించారు, కార్తికేయ 2 పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాతలు సమర్పిస్తున్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం హిందీలో చిత్రీకరించబడింది,  బెంగాలీ, తెలుగులో 2025లో థియేటర్లలో విడుదల కానుంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు