రాజ‌మండ్రి స‌బ్‌-క‌లెక్ట‌ర్ అనుప‌మ ‘ఉనికి’ క‌థ‌కు మూలం

ఆదివారం, 31 జనవరి 2021 (17:27 IST)
Chitra Sulka, Uniki
‘నాటకం’ ఫేమ్ ఆశిష్ గాంధీ, ‘రంగుల రాట్నం’ ఫేమ్ చిత్రశుక్లల కాంబినేషన్లో రాజ్‌కుమార్ బాబీ దర్శకత్వంలో ఎవర్గ్రీన్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి నిర్మిస్తున్న చిత్రానికి ‘ఉనికి’ అనే టైటిల్ని ఖరారు చేశారు. ఈ చిత్రం టైటిల్ని, ఫస్ట్ ఎటాక్ పోస్టర్ని రాక్స్టార్ మంచు మనోజ్ ఆవిష్కరించారు. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు బాబీ ఏడిద, రాజేష్ బొబ్బూరి మాట్లాడుతూ, ‘’మా చిత్రం ఫస్ట్ ఎటాక్ పోస్టర్ని ఆవిష్కరించిన రాక్‌స్టార్ మంచు మనోజ్ గారికి చాలా థాంక్స్. ఈప్రపంచంలో ఏ మనిషైనా తన ఉనికి చాటుకోవడం కోసం తపిస్తాడు. ముఖ్యంగా అననుకూల పరిస్థితులు, అడ్డంకులు, అవరోధాలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువగా ఉనికి కోసం తపిస్తారు. ఓ సామాన్య మధ్య తరగతి యువతికి అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు తన ఉనికి నిలుపు కోవడం కోసం ఎలా పోరాడింది అనేది ఈ చిత్రం ప్రధాన కథాంశం.

రాజమండ్రి సబ్-కలెక్టర్ అంజలి అనుపమని చూసినప్పుడు కలిగిన ఆలోచనతో ఈ స్క్రిప్ట్ తయారు చేయడం జరిగింది. అలాగని ఇదేమి ఆమె రియల్ స్టోరీకాదు. ఇందులో ప్రతి సన్నివేశం కొత్తగాను, ఆసక్తికరంగాను అనిపిస్తుంది. ఈ రోజుతో చిత్రీకరణ మొత్తం పూర్తయింది. 45 రోజుల పాటు రెండు షెడ్యూల్‌లో చిత్రీకరించాం. ఉభయ గోదావరి జిల్లాలోని అందమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇందులో మొత్తం మూడు పాటలున్నాయి . ఈ సమ్మర్‌కి రీలీజ్ ప్లాన్ చేస్తున్నాం’’ అని తెలిపారు. 
 
టీఎన్ఆర్’’,’రంగస్థలం’ నాగ మహేష్, అప్పాజీ అంబరీష, ప్రభావతి, టిక్ టాక్ దుర్గారావు, పద్మశ్రీ ,, బండి స్టార్కిరణ్ తదితరులు ఈ చిత్ర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ: బాబీ ఏడిద, రచన: సరదా శ్యామ్, ఛాయాగ్రహణం-కూర్పు: హరికృష్ణ, సంగీతం: పి. ఆర్ (పెద్దపల్లి రోహిత్), కాస్ట్యూమ్స్. రూపరేఖ గుత్తి, సహనిర్మాత: అడ్డాల రాజేష్, నిర్మాత‌లు: బాబీ ఏడిద‌, రాజేష్ బొబ్బూరి, ద‌ర్శ‌క‌త్వం: రాజ్‌కుమార్ బాబీ.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు