నిధి అగర్వాల్‌కు మెగా ఆఫర్ : పవన్ సరసన ఛాన్స్

ఆదివారం, 31 జనవరి 2021 (16:21 IST)
టాలీవుడ్ కుర్ర హీరోయిన్ నిధి అగర్వాల్‌కు బంపర్ ఆఫర్ వరించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రంలో పవన్ కలిసి నటించనుంది. 
 
నిజానికి ఈ భామ బాలీవుడ్ సినిమా మున్నా మైఖెల్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఈ అమ్మడుకు బ్రేక్ చ్చింది. అందులో తన అందాల నిధిని మొత్తాన్ని బయటపెట్టింది. 
 
టైగర్ ష్రాఫ్‌తో ఈ సినిమాలో జోడీ కట్టింది నిధి అగర్వాల్‌కు.. ఆ తర్వాత హిందీలో అవకాశాలు రాలేదు. దాంతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చింది. ఇక్కడ అక్కినేని బ్రదర్స్ అఖిల్, నాగ చైతన్యలతో వరసగా రొమాన్స్ చేసింది. చైతూతో "సవ్యసాచి".. అఖిల్ అక్కినేనితో "మిస్టర్ మజ్ను" సినిమాలు చేసింది. 
 
అయితే ఈ రెండు డిజాస్టర్స్ కావడంతో నిధి అగర్వాల్ ఐరెన్ లెగ్ ముద్ర వేయించుకుంది. అలాంటి సమయంలో వచ్చింది 'ఇస్మార్ట్ శంకర్'. పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. రామ్ హీరోగా వచ్చిన ఈ సినిమా రూ.40 కోట్ల షేర్ వసూలు చేసి నిధి అగర్వాల్‌కు కావాల్సిన బ్రేక్ తీసుకొచ్చింది. 
 
ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంలోనే వరస అవకాశాలు అందుకుంటుంది నిధి. తెలుగులో కెరీర్ టర్నింగ్ ఆఫర్స్ రావడం లేదు కానీ తమిళనాట మాత్రం ఈ మధ్యే జయం రవి హీరోగా వచ్చిన ‘భూమి’, శింబు సరసన ‘ఈశ్వరన్’ సినిమాల్లో నటించింది. 
 
ఇపుడు తెలుగులో ఊహించని అవకాశం అందుకుంది. ఏకంగా మెగా హీరో పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ హీరోగా నటిస్తున్న సినిమాలో నిధి హీరోయిన్‌గా నటిస్తుంది. 
 
ఇప్పటికే షూటింగ్‌లో కూడా అడుగు పెట్టింది ఈ ముద్దుగుమ్మ. ఈ ఒక్క సినిమాతో ఖచ్చితంగా నిధి జాతకం మారిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. 2022 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత నిధి కెరీర్ ఎటువైపువెళ్తుందో.. వేచిచూడాల్సిందే.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు