మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ధ్రువ. ఇది ‘తని ఒరువన్’ తమిళ చిత్రంకు రీమేక్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంది ఆదరణ లభిస్తోంది. వ్యూస్ సంఖ్య భారీగా పెరిగిపోతూనే వుంది. కాగా ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇదిలా ఉంటే.. ధ్రువ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల్లోనే లక్షల వ్యూస్ సాధించి రికార్డు సాధించింది. దీనిపై బాహుబలి జక్కన్న రాజమౌళి స్పందించారు. ఈ ట్రైలర్ తెగనచ్చేసిందట. తన ట్విట్టర్ పేజీలో 'ధ్రువ' ట్రైలర్ లింక్‌ను అప్‌లోడ్ చేసిన రాజమౌళి చరణ్‌ను, సురేందర్ రెడ్డిని అభినందించారు. 'చాలా స్టైలిష్, ఎంతో ప్రామిసింగ్. సురేందర్ రెడ్డి, రామ్‌చరణ్‌లకు అభినందనలు. రీమేక్ సినిమాలు చేయడం చాలా కష్టం' అని రాజమౌళి ట్వీట్ చేశారు.