నేషనల్ అవార్డ్ డైరెక్టర్‌తో రాజశేఖర్

మంగళవారం, 11 ఆగస్టు 2020 (18:35 IST)
డా.రాజశేఖర్ కెరీర్ ఇక అయిపోయింది అనుకున్న టైమ్‌లో వచ్చిన సినిమా గరుడవేగ. ఈ సినిమాతో రాజశేఖర్ మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. ఆ తర్వాత అ.. సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కల్కి సినిమా చేసాడు. ఇది ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోయినా... ఫరవాలేదు అనిపించింది.
 
కల్కి తర్వాత రాజశేఖర్ సినిమా ఇప్పటివరకు ఎనౌన్స్ చేయలేదు. అహనా పెళ్లంట, పూలరంగడు, భాయ్ చిత్రాల దర్శకుడు వీరభద్రమ్ చౌదరి డైరెక్షన్లో రాజశేఖర్ మూవీ అంటూ వార్తలు వచ్చాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు.
 
తాజా వార్త ఏంటంటే... రాజశేఖర్‌కి ఇటీవల నేషనల్ అవార్డ్ డైరెక్టర్ నీలకంఠ ఓ స్టోరీ చెప్పాడట. ఈ కథ రాజశేఖర్‌కి చాలా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పినట్టు టాక్. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమాని రాజశేఖరే నిర్మించనున్నట్టు సమాచారం. మరి.. ఫామ్ లోని డైరెక్టర్ నీలకంఠతో రాజశేఖర్ చేసే సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు