కబాలి సరికొత్త సంప్రదాయం.. కబాలి యాప్.. ఆడియో లీక్!

శనివారం, 11 జూన్ 2016 (19:32 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి సినిమా ద్వారా సరికొత్త రికార్డు నమోదైంది. రజనీకాంత్ కబాలి టీజర్ సోషల్ మీడియా పెను సంచలనం సృష్టించిన నేపథ్యంలో.. దీనిని క్యాష్ చేసుకునేందుకు గాను సినీ నిర్మాతలు కబాలి యాప్‌ను రూపొందించి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఈ యాప్ ద్వారా కబాలి సినిమాకు సంబంధించిన వివరాలను అందిస్తామని తెలిపారు.   
 
ఇదిలా ఉంటే కబాలి ఆడియో లీకైనట్లు కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. జూన్ 12న ఆడియోకు రంగం సిద్ధమవుతుండగానే.. ఇంటర్నెట్‌లో పాటలు లీక్ అయ్యాయి. రజనీ కాంత్ పవర్ ఫుల్ వాయిస్‌లో అదరగొట్టే డైలాగులతో ఓ సాంగ్ ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.

వెబ్దునియా పై చదవండి