ఈ మూవీ పూర్తి కాగానే 'ఇండ్రు - నేట్రు - నాళై' చిత్రం ఫేమ్ రవికుమార్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో ఆయనకు జంటగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సైంటిఫిక్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ చిత్రంకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. జూన్ చివరి వారంలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ళనుందని సమాచారం.